భువనగిరి: యువ తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సాయంత్రం ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభావేదికపైన పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీ కండువా కప్పి బాలకృష్ణా రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనం జైజగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సభలో మాజీ మంత్రి కొండా సురేఖ, వైవి సుబ్బారెడ్డి, రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment