కాంగ్రెస్ వ్యతిరేక పునాదులమీద పుట్టిన తెలుగుదేశం పార్టీ అదే కాంగ్రెస్‌తో పార్టీతో కలిసిపోయిందని చిత్తూరుజిల్లా తంబళ్లపల్లి టీడీపీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై సర్కారును నిలదీయాల్సిన టీడీపీ కాంగ్రెస్‌తో కుమ్మక్కైందన్నారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి మంగళవారం చంచల్‌గూడ జైల్లో జగన్ ను కలిశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలు గాలికొదిలేసిన కాంగ్రెస్,టీడీపీలు కేవలం వైఎస్ కుటుంబాన్ని వేధించటమే పనిగా పెట్టుకుందన్నారు. ఇబ్బందులు వస్తే నిలదీయాలని టీడీపీకి ప్రజలు 90 సీట్లు ఇస్తే స్వార్థరాజకీయాల కోసం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏకమయ్యాయన్నారు.
జగన్ కు సంఘీభావం తెలిపేందుకే తాను వచ్చినట్లు ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అతి త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతిపక్షంగా టీడీపీ విఫలమైందని, ప్రజల నమ్మకాన్ని బాబు వమ్ము చేశారని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అసలైన ప్రతిపక్షం అని ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. జగన్ ను తాను మనస్పూర్తిగా సమర్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.

No comments:
Post a Comment