మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర అనంతపురం జిల్లా ఉరవకొండలో సాగుతోంది. యాత్రలో భాగంగా నేత కార్మికుడు కాసుల ఆంజనేయులు ఇంటికి వెళ్లి మగ్గాలను షర్మిల పరిశీలించారు. అనంతరం ఉరవకొండ బస్టాండ్ సెంటర్ కు చేరుకున్న షర్మిలకు అపూర్వ స్వాగతం లభించింది. మహానేత తనయను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. ఎటుచూసినా జనమే కనిపించారు.
source:sakshi Saturday, 3 November 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment