చంద్రబాబు పాదయాత్ర పెద్ద డ్రామా అని, ఆయన కోసం చేసుకుంటున్న ప్రచార యాత్ర అని ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి, వైఎస్సార్‌సీపీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. జననేత జగన్ సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం అనంతపురం జిల్లా కూడేరు మండలంలో సాగింది. ఈ యాత్రలో పాల్గొన్న అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. అబద్ధాలు చెప్పడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.
పాదయాత్ర ప్రజల కోసమే చేస్తున్నానంటూ బురిడీ కొట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ‘రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతోందని చంద్రబాబు అంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే బలం, సత్తా ఆయనకున్నా ఎందుకు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు.. నిజంగా దమ్ముంటే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలి. అప్పుడు ప్రజలు విశ్వసిస్తార’ని అన్నారు. ‘ప్రభుత్వం దిగిపోకుండా బాబు పూర్తి మద్దతు ఇస్తున్నారు.
ఆయనపై ఎలాంటి కేసులు మోపకుండా ప్రభుత్వం కాపాడుతోంది. బాబు తొమ్మిదే ళ్ల పాలనలాగే కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది. ప్రభుత్వానికి ప్రజల గోడు ఏమాత్రం పట్టడం లేదు. బీసీలను ఇన్ని రోజులూ విస్మరించిన చంద్రబాబు ఇప్పుడు 100 సీట్లంటూ మాయాజాలం చేస్తున్నారు. జగన్ బయట ఉంటే తమ మనుగడ ఉండదని భావించే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు జననేతకు అండగా నిలుస్తార’ని స్పష్టం చేశారు.

No comments:
Post a Comment