రాష్ర్టంలోని 4 లక్షల మంది హస్టల్ విద్యార్ధుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారంటూ గత నెల రోజులుగా ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో విద్యార్థులు ఉద్యమం చేస్తున్నా సర్కార్ స్పందించలేదు. దీనిపై మండిపడ్డ విద్యార్ధులు నగరం లోని ఇందిరా పార్క్ వద్ద ఆందోళనలకు దిగారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలమంది విద్యార్థులు ఉదయమే ఇందిరా పార్కుకు చేరుకున్నారు. హాస్టల్ నిద్ర పేరుతో ముఖ్యమంత్రి ప్రచారం చేసుకుంటున్నారు తప్ప... సమస్యల్ని గుర్తించడంలేదని విద్యార్థులు భగ్గుమన్నారు. మెస్ ఛార్జీలను 1500 రూపాయలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ ముట్టడికి బయల్దేరిన హాస్టల్ విద్యార్థుల్ని మధ్యలోనే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. వామపక్ష నేతలు కూడా ఈ ధర్నా లో పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment