శ్రీకాకుళం జిల్లా కొత్తూరు(ప్రస్తుతం పాలకొండ నియోజకవర్గం) మాజీ ఎమ్మెల్యే జె.మినాథి గొమాంగో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి సమక్షంలో గొమాంగోతోపాటు అనుచరులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా గొమాంగో మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరె డ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రస్తుత పాలకుల వల్ల నీరుగారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నవీన్ రాజీనామాకు ఆమోదం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ నేమూరి నవీన్‌గౌడ్ రాజీనామాను ఆమోదించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. వ్యక్తిగత కారణాలతో నవీన్ చేసిన రాజీనామాను పార్టీ అధ్యక్షుడు ఆమోదించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.
No comments:
Post a Comment