ఐఏబీ సమావేశం తూతూ మంత్రంగానే జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. టీడీపీ సభ్యులు గొడవ చేస్తుంటే మంత్రి రఘువీరా రెడ్డి చోద్యం చూశారని అన్నారు. మంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తుంగభద్ర నీటి పంపిణీపై రఘువీరా చేసిన ప్రకటనపై నమ్మకం లేదన్నారు. తుంగభద్ర నీరు వృథాగా పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. పూడికతీతపై కర్ణాటక ముందుకొచ్చినా మన ప్రభుత్వంలో స్పందన కరువయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
హెచ్‌ఎల్‌సీ ఆధునీకరణ పనులు ఎందుకు ఆపివేశారని విజయమ్మ ప్రశ్నించారు. అనంతపురానికి వైఎస్ కేటాయించిన 10 టీఎంసీల నీరు ఎందుకు ఇవ్వలేదని అడిగారు. జలయజ్ఞం ద్వారా కోటి ఎకరాలకు నీరందించాలని వైఎస్ కలలు కన్నారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి వస్తే జలయజ్ఞానికే తొలి ప్రాధాన్యత నిస్తుందని విజయమ్మ తెలిపారు.

No comments:
Post a Comment