ఎమ్మెల్సీగా తనను అనర్హుడిగా ప్రకటించడాన్ని కొండా మురళి హైకోర్టులో సవాల్ చేశారు. మండలి ఛైర్మన్ ఆదేశాల్ని ఆయన తన సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనర్హత విషయంలో ఛైర్మన్ కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టు వ్యవహరించారని కొండా మురళి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొండా మురళి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.... ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్ పరిశీలించిన మండలి ఛైర్మన్ చక్రపాణి .ఎమ్మెల్సీ కొండా మురళిని అనర్హుడిగా ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment