YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 18 August 2012

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌దే హవా!


‘‘రాజకీయ ప్రత్యర్థులను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టే ప్రయత్నాలను వ్యవస్థీకృతం చేసిన కాంగ్రెస్‌పార్టీ అం దుకు తగిన మూల్యాన్ని చెల్లించబోతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోబోతున్నది.’’

ఈ వ్యాఖ్యలు చేసింది ఏ రాజకీయపార్టీ నాయకుడో కాదు. ప్రముఖ ఆంగ్ల వారపత్రిక ‘ఇండియా టుడే’ అభిప్రాయమిది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీ చావుదెబ్బ తిన బోతున్నదని అది అంచనా వేసింది. విఖ్యాత ప్రజాభిప్రాయసేకరణ సంస్థ ఏసీ నీల్సన్‌తో కలసి ఇండియాటుడే నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు రాజ కీయకక్షతో సాగుతున్నదేనని రాష్ర్టంలో 64 శాతం మంది విశ్వసిస్తున్నట్లు సర్వే పేర్కొంది. 2009లో కాంగ్రెస్‌కు ఓటు వేసిన వారిలో అత్యధికులు పార్టీని వీడి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లారని సర్వే అంచనా వేసింది. లోక్ సభ ఎన్నికలలోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఘనవిజ యాలు నమోదు చేస్తుందని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ సీట్లలో అధిక భాగం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అది పేర్కొంది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కి 23 నుంచి 27 వరకూ సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. 2009 ఎన్నికల్లో 33 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీకి 3 నుంచి 8 మాత్రమే వస్తాయని, 18 శాతానికి మించి ఓట్లు రావని సర్వే అంచనా వేసింది. 

కాంగ్రెస్, పీఆర్‌పీలకు కలిపి గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 52.6 శాతం ఓట్లలో 34.6 శాతం వరకూ కోతపడతాయని సర్వే పేర్కొంది. బీజేపీకి 2009లో 3.8 శాతం ఓట్లు రాగా ఇప్పుడు అవి 4 శాతం వరకు రావచ్చునని సర్వే అంచనావేసింది. రాష్ర్టంలో కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలకు... (ప్రధానంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీలకు) 78 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. ఈ పక్షాలకు 34 నుంచి 39 వరకూ సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 23 నుంచి 27 వరకు వస్తాయని సర్వేలో తేలిం ది కాబట్టి మిగిలిన 11 నుంచి 12 సీట్లు టీఆర్‌ఎస్, టీడీపీ లకు వచ్చే అవకాశం ఉందన్నమాట. 

పతనం దిశగా కాంగ్రెస్

రాష్ర్టంలోనే కాదు దేశవ్యాప్తంగానూ కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. గత లోక్‌సభ ఎన్నికల తర్వాత యూపీఏ పతనం దిశగా పయనిస్తోంది. యూపీఏ ముఖ్యంగా కాంగ్రెస్ వచ్చే ఎన్నికల నాటికి కోలుకోలేనంతగా పతనమవుతుందని సర్వే అంచనా వేసింది. ఆరునెలల క్రితం జరిగిన సర్వేతో పోల్చిచూస్తే యూపీఏ కన్నా ఎన్డీయే 15 నుంచి 20 సీట్లు పైకి ఎగబాకింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే అధికారంలోకి వస్తుం దని సర్వేలో తేలింది. 2009 ఎన్నికల్లో 259 సీట్లు గెలుచుకున్న యూపీఏ ఇప్పుడు 171 నుంచి 181 సీట్లలో మాత్రమే విజయం సాధించగలదని సర్వే అంచనా వేసిం ది. గత ఎన్నికల్లో 159 స్థానాలు నెగ్గిన ఎన్డీయే ఇప్పుడు 195 నుంచి 205 స్థానాలలో విజయం సాధించగలదని సర్వే పేర్కొంది. 

యూపీఏకి ఆక్సిజన్ అందిస్తున్న పార్టీలు కూడా సమస్యలతో సతమతమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి దన్నుగా నిలిచిన ఓటర్లలో 15శాతం మంది బీజేపీకి అనుకూలంగా మారారని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ ఓట్లలో కూడా 11 శాతం బీజేపీకి అనుకూలంగా మారాయని తేలింది. ఇక్కడ ఎస్‌పీకి 23 నుంచి 27 సీట్లు, బీఎస్‌పీకి 17 నుంచి 21 సీట్లు వస్తాయని అంచనా. తమిళనాడులో కాంగ్రెస్-డీఎంకేల పరి స్థితి అంతగా మెరుగుపడలేదు. ఇప్పటికీ జయలలిత ప్రభావం బాగానే ఉంది. అయితే తమిళనాడులో కాంగ్రెస్ బాగా నష్టపోనున్నదని సర్వే అంచనా వేసింది. 16 శాతం కాంగ్రెస్ ఓట్లు డీఎంకేకి మారడం ఇక్కడి విశేషం. 

గుజరాత్‌లో నరేంద్రమోడీ పాపులారిటీ ముందు కాంగ్రెస్ వెలవెలపోతోంది. గత ఎన్నికల్లో వచ్చిన 11 సీట్లను నిలబెట్టుకోవడం కష్టమని సర్వేలో తేలింది. 6 నుంచి 10 సీట్లు మాత్రమే వస్తాయని, బీజేపీ 16 నుంచి 20 సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది. మహారాష్ర్ట, రాజస్థాన్‌లలో కూడా కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా లేదు. మహారాష్ర్టలో ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య గొడవలు యూపీఏ ఓట్లకు గండికొట్టనున్నాయి. ఇక్కడ యూపీఏకి 20 నుంచి 23 సీట్లు, ఎన్డీయేకి 23 నుంచి 28 సీట్లు వస్తాయని అంచనా. రాజస్థాన్‌లో అవినీతి ఆరోపణల కారణంగా కాంగ్రెస్ ఓట్లు బాగా తగ్గనున్నాయి. యూపీఏకి 5 నుంచి 10 సీట్లు, ఎన్డీయేకి 10 నుంచి 15 సీట్లు వస్తాయి. కర్ణాటకలో మాత్రం బీజేపీ అంతఃకలహాల వల్ల కాంగ్రెస్‌కు కొద్దిగా లాభంచేకూరే అవకాశాలున్నాయి. బీజేపీ 9 శాతం ఓట్లు కోల్పోతుందని సర్వే పేర్కొంది. 

రాహుల్‌కు తగ్గిన మద్దతు

ప్రధానిగా ఎవరయితే బాగుంటుందన్న ప్రశ్నకు 21 శాతం మంది నరేంద్రమోడీకి ఓటేశారు. జనవరిలో జరిగిన సర్వేలో 24 శాతం మంది మోడీకి అనుకూలంగా ఓటేయగా ఇప్పుడు అది 3 శాతం తగ్గింది. కాంగ్రెస్ పార్టీ భావి ప్రధానిగా ప్రచారంలో ఉన్న రాహుల్‌గాంధీకి ప్రజల మద్దతు మరింతతగ్గిపోయిందని ఈ సర్వే అంచనా వేసిం ది. జనవరి సర్వేలో 17 శాతం మంది రాహుల్‌గాంధీకి అనుకూలంగా ఓటేయగా అది ఇప్పుడు 10 శాతానికి పడిపోయింది. అద్వానీకి 8 శాతం, మన్మోహన్‌సింగ్‌కు 6 శాతం, సోనియాగాంధీకి 6 శాతం మంది ఓటేశారు. నితీశ్‌కుమార్ ప్రధాని అయితే బాగుంటుందని 2 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు.

కొన్ని ముఖ్యాంశాలు...

ప్రధాని మన్మోహన్‌సింగ్ అంచనాలకనుగుణంగా పని చేస్తున్నారా అంటే లేదని 54 శాతం మంది, పనిచేస్తున్నారని 38 శాతం మంది జవాబిచ్చారు.

ఆర్థిక సంస్కరణలను బీజేపీ అయితే బాగా అమలుచేయగలదని 66 శాతం మంది భావించారు.
యూపీఏ ధరలను అదుపుచేయలేదని 55 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ద్రవ్యోల్బణానికి ఎన్డీయే కళ్లెం వేయగలదని 47 శాతం మంది, కళ్లెం వేయలేదని 36 శాతం మంది ఓటేశారు.

గత ఏడాదితో పోల్చితే తమ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని 21 శాతం మంది చెప్పారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే నరేంద్రమోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా చేయవచ్చా అన్న ప్రశ్నకు 55 శాతం మంది అనుకూలంగా, 25 శాతం మంది వ్యతిరేకంగా ఓటేశారు.

కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని బరిలో నిలపాలని 42 శాతం మంది అభిప్రాయపడ్డారు. 19 శాతం మంది సోనియాను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని పేర్కొన్నారు.

2014 ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రధానిగా నితీశ్‌కు 26 శాతం, జయలలితకు 8 శా తం, శరద్‌యాదవ్‌కు 7 శాతం, నవీన్‌పట్నాయక్‌కు 4 శాతం, ప్రకాశ్‌సింగ్‌బాదల్‌కు 3 శాతంమంది ఓటేశారు.

ఇప్పటివరకూ ఉత్తమ ప్రధాని ఎవరన్న ప్రశ్నకు ఇంది రాగాంధీకి 30 శాతం మంది, వాజ్‌పేయికి 24 శాతం, జవహర్‌లాల్‌నెహ్రూకు 13 శాతం, రాజీవ్‌గాంధీకి 12 శాతం, లాల్‌బహదూర్‌శాస్త్రికి 7 శాతం ఓట్లు పడ్డాయి. 

ఉత్తమ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గతసర్వేలో మాదిరిగా ఈసారీ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నా రు. తర్వాత స్థానంలో నితీశ్‌కుమార్ ఉన్నారు. మూడో స్థానంలో యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్ ఉన్నారు. తర్వాత స్థానాలలో షీలాదీక్షిత్, జయలలిత, పృధ్వీరాజ్‌చవాన్, మమతాబెనర్జీ, కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

-నీల్సన్ - ఇండియాటుడే సర్వే 

కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదు!

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడమే యూపీఏ దుస్థితికి ప్రధాన కారణం. కాంగ్రెస్ కంచుకోటల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ ఇమేజ్ బాగా దిగజారిపోయింది. రాష్ర్టంలో జగన్‌మోహన్‌రెడ్డి వల్లే కాంగ్రెస్ కంచుకోట బద్దలు కాబోతున్నదన్నది నిర్వివాదాంశం. యూపీఏ పతనానికి మూడు కారణాలున్నా యి. ధరల పెరుగుదల మొదటిది. ఈ విషయంలో ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. రెండోది అవినీతి. దీనిని కూడా ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. మూడోది పరిపాలన. కాంగ్రెస్ పార్టీ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ప్రత్యర్థులను భయకంపితం చేస్తూ పరిపాలన సాగిస్తోంది. తనను వ్యతిరేకించిన వాళ్లను జైలుపాల్జేస్తోంది. మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత రాజ్యంలో ఉన్నామా అన్న సందేహం వస్తోంది. ఇలా వ్యవహరించిన చోటల్లా కాంగ్రెస్ పార్టీ పతనం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించబోతున్నది. రాష్ర్టంలో కాంగ్రెస్ స్థానాన్ని జగన్ భర్తీ చేయబోతున్నారు. రాజశేఖరరెడ్డి వారసత్వం ఆయన కుమారుడు జగన్‌కే చెందుతుం దని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడి విషయంలో కేంద్రంలోనూ, రాష్ర్టంలోనూ కాంగ్రెస్‌పార్టీ అనుసరిం చిన కక్షపూరిత వైఖరి ప్రజలను బాగా కదిలించివేసింది. ఆయనకు ప్రజల మద్దతు పెరగడానికి అది కూడా కారణమైంది. తమలాగే ఆయన కూడా కష్టాలు పడుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు రాష్ర్టప్రజల ఆశ, ఆకాంక్ష ఆయనే. ఆయన వారి నాయకుడిగా ఎదిగారు. ఇక టీడీపీ విషయానికొస్తే ప్రతిపక్ష పార్టీగా కూడా అది అర్హత కోల్పోయింది. రాజీ అనే ఉచ్చులో చిక్కుకున్న రోజునే దాని పతనం ప్రారంభ మైంది. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం, ప్రతిపక్షంగా పోరాడుతున్నట్లు నాటకమాడటం... ఇలా రెండు రకాలుగా నడుచుకోవడాన్ని ప్రజలు తీవ్రంగా పరిగణిస్తారు. తీవ్రంగా శిక్షిస్తారు. ప్రతి ఎన్నికలోనూ ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

-ఎం.జె.అక్బర్, సీనియర్ పాత్రికేయులు

1 comment:

  1. Even the most common people are able to identify the "BRUTALITY" in the congress party(INC) and the "HUMANITY" in the YSRCP. This inward flow of good people, will continue to YSRCP with more and more strength. Who can tolerate the "BRUTALITY" in the HOLY India? People need HUMANITY for their own survival. The INC under the leadership of Sonia Gandhi, is going to be closed soon.

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!