ఏలూరు: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి డిమాండ్ చేశారు. ఫీజురీయింబర్స్ మెంట్ పథకంపై విజయమ్మ చేస్తున్న దీక్ష శిబిరంలో ఈరోజు ఆయన ప్రసంగించారు. ఆ మహానేత పథకాలను కొనసాగించి ప్రభుత్వం పరువు నిలుపుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు. ప్రతి ఒక్క పేద విద్యార్థి ఉన్నత చదువులు కొనసాగించాలన్న మహొన్నత ఆశయంతో రాజశేఖర రెడ్డి ఫీజురీయింబర్స్ మెంట్ పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. ఆ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. జగన్మోహన రెడ్డి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం వస్తుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment