పులివెందుల (వైఎస్సార్ జిల్లా) న్యూస్‌లైన్ : పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ)కు కేటాయింపుల మేరకు నీటిని విడుదల చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. పీబీసీ నీటి కోసం ఆయన సోమవారం పులివెందుల నుంచి పాదయాత్ర చేపట్టారు. లింగాల, కర్నపాపాయపల్లె, వెలిదండ్ల, పార్నపల్లె, దాడితోట, తాడిమర్రి, బత్తలపల్లె మీదుగా ఈనెల 15వ తేదీకి అనంతపురానికి చేరుకుంటుంది. 105 కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్ర పులివెందుల, లింగాల మండలాలతో పాటు అనంతపురం జిల్లాలోని పలుగ్రామాల గుండా సాగుతుంది.
సోమవారం ఉదయం ప్రారంభించిన యాత్ర రాత్రికి అనంతపురం జిల్లా తాడిమర్రికి చేరుకుంది. పాదయాత్ర సందర్భంగా భారీగా తరలి వచ్చిన రైతులను ఉద్దేశించి వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రసంగిస్తూ, పీబీసీ నీటి విషయంలో న్యాయం చేయాలని కోరేందుకు పాదయాత్రను చేపట్టామన్నారు. వైఎస్ మరణం తర్వాత పీబీసీ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతున్నదని, జిల్లాలోని మైలవరం రిజర్వాయర్‌కు కూడా రావాల్సిన కోటా ఇవ్వకుండా అధికారులు తీవ్రనిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అధికారుల తీరుతో ఈ ప్రాం తాలు ఎడారిగా మారే అవకాశం ఉందన్నారు. ఈనెల 15న జరిగే సమావేశంలో సమస్య తీవ్రతను ఐఏబీ చైర్మన్, అనంతపురం కలెక్టర్‌కు వివరిస్తామన్నారు. గత ఏడాది పీబీసీ నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయం ఫలితంగా చీనీచెట్లకు అపారనష్టం వాటిల్లిందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మైదుకూరు మాజీ ఎమ్మె ల్యే రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ అవినాష్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రకు గ్రామాలలో ఘన స్వాగతం లభించింది.
No comments:
Post a Comment