కాంగ్రెస్ ప్రభుత్వం... మహానేత సంక్షేమ పథకాల్ని నీరుగారుస్తూ, ప్రజలమీద పన్నుల భారం మోపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ప్రజల మీద పైసా పన్నుభారం మోపకుండా సంక్షేమ కార్యక్రమాలను దివంగతనేత వైఎస్సార్ అమలు చేశారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం- మూడునెలలకోసారి విద్యుత్ సర్‌చార్జీల పేరుతో ఎడాపెడా పన్నులు వసూలు చేస్తోందని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం విద్యుత్ సర్‌చార్జీలు వేస్తూ, నాణ్యమైన కరెంట్‌ను సరఫరా చేయలేకపోతోందని శ్రీకాంత్‌రెడ్డి తప్పుబట్టారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment