అనంతపురం: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన తుంగభ్రద ప్రాజెక్టు హెచ్ ఎల్ సి(హై లెవెల్ కెనాల్) ఆధునీకరణ పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విమర్శించారు. నీటిపారుదల సలహా మండలి (ఐఏబి- ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు) సమావేశంలో ఆమె గళం విప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎక్కువ నీటిని రాష్ట్రానికి తీసుకురాలేకపోతున్నామని ఆమె అన్నారు.
గందరగోళం మధ్య ప్రారంభమైన సమావేశంలో తుంగభద్రలో నీరు పుష్కలంగా ఉన్నా తాగునీరు ఎందుకివ్వడంలేదు? అని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి అధికారులను ప్రశ్నించారు. నీటి కేటాయింపులపై కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి, ఎమ్మెల్యే లింగా రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. తాగు నీరు విడుదల చేయాలంటూ మంత్రి రఘువీరా రెడ్డిని టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, డీకే పార్థసారథి నిలదీశారు. హామీ ఇచ్చేంతవరకు సమావేశం జరగనివ్వం అంటూ నినాదాలు చేశారు.
అంతకు ముందు సమావేశాన్ని అడ్డుకునేందుకు సిపిఐ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని అదుపు చేసేందుకు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సమావేశం జరుగుతున్న రెవెన్యూ భవన్‌కు విద్యుత్ సరఫరాని నిలిపివేశారు.

No comments:
Post a Comment