పులివెందుల : పులివెందుల ప్రాంతానికి తాగునీటితోపాటు రైతులకు సాగునీరు ఇవ్వాలన్న ప్రధాన డిమాండుతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి సిద్ధమైంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగపు అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో వందలాది మంది రైతులు పాదయాత్ర చేపట్టారు.
సోమవారం ఉదయం పులివెందులలోని రాజీవ్‌నగర్ కాలనీ వద్ద ఉన్న మహానేత వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పాదయాత్రగా అనంతపురానికి బయల్దేరారు. చిత్రావతి, మైలవరానికి రావలసిన నీటి కోసం అనంతపురం కలెక్టరేట్ వరకూ అవినాష్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఆయన చేపట్టిన పాదయాత్రకు ఈసీ గంగిరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మద్దతు పలికారు.

No comments:
Post a Comment