YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 12 August 2012

వైఎస్సార్, పీజేఆర్ ఆశయాలు ఒక్కటే. నాడు పీజేఆర్.. నేడు విజయారెడ్డి వెంట



వేలాది మంది కార్యకర్త లు, అభిమానుల హర్షాతిరేకా లు, ‘జయహో జగన్, పీజేఆర్, వైఎస్సార్ అమర్హ్రే’ నినాదా ల మధ్య మాజీ సీఎల్పీ నాయకు డు పీజేఆర్ తనయ విజయారెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ విజయారెడ్డికి పార్టీ కండువా కప్పి సభ్యత్వాన్ని అందజేశారు. ఈ పరిణామం నగర రాజకీయాల్లో ఓ మలుపు కానుందని పరిశీకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, పీజేఆర్ తరహాలోనే విజయారెడ్డి మధ్యాహ్నం తొలుత ఖైరతాబాద్ మహం కాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించారు.

ఆపై ఖైరతాబాద్ సర్కిల్‌లోని తన తండ్రి పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పంజగుట్ట చౌరస్తాలోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల కోలాహలం మధ్య నాగార్జునసర్కిల్, బంజారాహిల్స్ రోడ్డునెంబర్-3, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా రోడ్డునెంబర్-45లోని వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.

దారి పొడవునా నినాదాలతో హోరెత్తించా రు. పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యనేతలు వైవీ సుబ్బారెడ్డి, రోజా, నిర్మలాకుమారి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, రహమాన్, ఆదం విజయ్‌కుమార్, రాజ్‌ఠాకూర్, జనార్ధన్‌రెడ్డి తదితరులు విజయారెడ్డిని ఆహ్వానించారు.

నాడు పీజేఆర్.. నేడు విజయారెడ్డి వెంట

పీజేఆర్ అనుచరణగణం నేడు విజయారెడ్డి బాట పట్టింది. పి.జనార్దన్‌రెడ్డి అనుంగు శిష్యుడిగా ముద్రపడ్డ ఖైరతాబాద్‌కు చెందిన కమ్మరి కృష్ణ కుటుంబం ఇప్పుడు ఆమె వెంట వైఎస్‌ఆర్‌సీసీలోకి చేరింది. అందులో కమ్మరి శ్రీనివాస్, కమ్మరి వినయ్, కమ్మరి వెంకటేశ్, కమ్మరి వరప్రసాద్ ఉన్నారు. అదే డివిజన్‌కు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు రవికాంత్, సురేశ్‌యాదవ్, శ్రీనివాస్‌యాదవ్, కిరణ్‌యాదవ్, కిషన్ తదితరులు ఆమెతో పాటు పార్టీలో చేరారు. అలాగే సోమాజీగూడ డివిజన్‌కు చెందిన నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వైఎస్ మహేశ్‌యాదవ్ తన అనుచరగణంతో పార్టీలో చేరారు.

అదే డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్యనారాయణగౌడ్, రజనీకాంత్, రిటైర్డ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అబ్బాస్ అలీ, టీడీపీకి చెందిన వినోద్, హరి, శ్రీకాంత్, విజయ్, సునీల్‌లు చేరారు. పంజగుట్ట డివిజన్ నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకులు యాదగిరి, శ్రావణ్‌కుమార్‌యాదవ్, సుభాన్, మురళిల అనుచరగణం వైఎస్‌ఆర్‌సీసీ తీర్థం పుచ్చుకుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ డివిజన్ల నుంచి భీంరావు, గోవర్ధన్, అరుణ్‌కుమార్‌లు తమ అనుచరులతో చేరారు.

వైఎస్సార్, పీజేఆర్ ఆశయాలు ఒక్కటే: విజయారెడ్డి

హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ ముఖ్యనేత దివంగత పి.జనార్ధన్‌రెడ్డి కుమార్తె విజయారెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ సమక్షంలో ఆమె పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. వేలాది మంది అనుచరులతో ఊరేగింపుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆమెకు విజయమ్మ.. వైఎస్సార్‌సీపీ కండువాను వేసి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో కార్యకర్తలను ఉద్దేశించి విజయమ్మ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు అందరమూ కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పని చేయడానికి పార్టీలో చేరిన విజయారెడ్డిని, ఆమె అనుచరులనూ తాను ఆహ్వానిస్తున్నానని, అభినందిస్తున్నానని విజయమ్మ అన్నారు. విజయారెడ్డి మాట్లాడుతూ దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి, తన తండ్రి పి.జనార్ధన్‌రెడ్డి ఆశయాలు ఒక్కటేనని అన్నారు. వారిద్దరూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడినందువల్లనే పేదల గుండెల్లో పదిలంగా నిలిచిపోయారని ఆమె అన్నారు. జగన్ నాయకత్వంలో త న తండ్రి ఆశయాల సాధనకు అందరమూ ఏకమై పని చేద్దామని అన్నారు. తన తండ్రిని అభిమానించే వారందరూ తనకు మద్దతునిస్తారనే నమ్మకంతో ముందుకు వచ్చానని చెప్పారు. ఇద్దరు నాయకులను(వైఎస్సార్, పీజేఆర్)లను ఏకం చేసిన ఘనత మీది అని మీడియా వారు అంటున్నారని, వారి మాటలను నిజం చేస్తూ ముందుకు సాగుదామని అనుచరులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనమంతా ఒక రాజకీయ పార్టీలో చేరాం కనుక ఇకపై రెండు వర్గాలుగా కాకుండా ఒకే వర్గంగా పనిచేద్దామని అన్నారు. ముస్లిం సోదర, సోదరీమణులు రంజాన్ రోజాలో ఉంటూనే ఊరేగింపుగా తన వెంట రావడం ఎంతో శుభ సూచకంగా భావిస్తున్నానని, తాను వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని విజయారెడ్డి చెప్పారు. పేదలంటే ఎంతో అభిమానించే పీజేఆర్ కుమార్తె జగన్ నాయకత్వంలో పని చేయడానికి వచ్చినందుకు తాను స్వాగతం పలుకుతున్నానని పార్టీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యురాలు ఆర్.కె.రోజా అన్నారు.

అచ్చం తండ్రిలాగానే..: అంతకు ముందు ఉదయం 11.15 గంటలకు ఖైరతాబాద్ చౌరస్తాలోని పీజేఆర్ విగ్రహానికి విజయారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. తరువాత మహంకాళి ఆలయంలో పూజలు చేశారు. దివంగత పీజేఆర్ ఏ కార్యక్రమం తలపెట్టినా తొలుత ఇదే ఆలయంలో పూజలు చేసి బయలుదేరే వారు. విజయ కూడా ఇదే సంప్రదాయాన్ని పాటించారు. అక్కడి నుంచి 11.40 గంటలకు తన అనుచరుల తో ఊరేగింపుగా బయలుదేరి పంజాగుట్ట చౌరస్తాలోని వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం 1.45 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకుని తన అనుచరులతో పాటుగా సభ్యత్వం తీసుకున్నారు. ఆమె వెంట భర్త జి.వెంకట భగవత్ రంగారెడ్డి, మామ జి.రాఘవరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనేతలు వై.వి.సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు ఎస్.సంతోష్‌రెడ్డి, ఎం.మారెప్ప, పార్టీ నాయకులు గట్టు రామచంద్రరావు, హెచ్.ఎ.రెహ్మాన్, వాసిరెడ్డి పద్మ, కొల్లి నిర్మలా కుమారి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి, రాజ్‌సింగ్ ఠాకూర్, ఆదం విజయకుమార్ తదితరులు హాజరయ్యారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!