YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 13 August 2012

ప్రభుత్వం కళ్లు తెరవాలి: జూపూడి

సీబీఐ దాఖలు చేసిన నాలుగో చార్జిషీటులో మంత్రులు, ఐఏఎస్ అధికారుల పేర్లను చేర్చిన తరువాతైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి, భూ కేటాయింపుపై ఇచ్చిన 26 జీవోలు సక్రమమేనని చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకర్‌రావు డిమాండ్ చేశారు. సీరియళ్లలా సీబీఐ వేస్తున్న చార్జిషీట్లలో ఏ రుజువులూ లేవని, ఇన్ని రోజుల దర్యాప్తులో ఏమీ సాధించలేకపోయారని అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

‘‘నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును ఐదో నిందితునిగా సీబీఐ చేర్చాకైనా ప్రభుత్వం ఆయనకు మద్దతుగా నిలవాలి. వాన్‌పిక్‌తో సహా అన్ని జీవోలూ జారీ చేసింది రాష్ట్ర సంక్షేమానికి, పరిశ్రమల అభివృద్ధికేనని చెప్పాలి. ధర్మానను నిందితునిగా చేర్చగానే ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అందరికీ ఉరితాళ్లు బిగుసుకోకముందే ప్రభుత్వం బదులివ్వాలి’’ అని డిమాండ్ చేశారు.

1 comment:

  1. CBI appointed on YSJ case seams to be with extraordinary powers.

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!