గుప్తుల పాలనను తలపించిన రాజశేఖర్ రెడ్డి పాలనపై ప్రభుత్వం కుట్ర ప్రకారం నిందలు వేస్తోందని వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. జగన్‌ను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తూ రాష్ట్ర క్యాబినెట్‌లోని మంత్రులంతా తాము తవ్వుకున్న గోతిలోనే పడ్డారని చెప్పారు. ఇంకెంతమంది మంత్రులకు ఉచ్చు బిగుస్తుందో అర్థం కావటం లేదని... ఇప్పటికైనా 26 జీవోలపై స్పష్టత ఇవ్వాలని మేకపాటి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేసేందుకు ఢిల్లీలో అందరూ సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.
ఎన్నికలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 40మంది ఎంపీలు గెలిచే పరిస్థితులు ఉన్నాయని మేకపాటి తెలిపారు. ఢిల్లీలో నిర్ణయాత్మక శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారబోతుందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని మేకపాటి పేర్కొన్నారు.

No comments:
Post a Comment