మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాపై ముఖ్యమంత్రి నిర్ణయంలో జాప్యంపై కాంగ్రెస్ పార్టీ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. ధర్మానను సమర్థిస్తే పరోక్షంగా జగన్‌పై ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించినట్లు అవుతుందని, లేకుంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు తప్పుచేసినట్లే ఒప్పుకున్నట్లు అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
శుక్రవారం ఉదయం 'సాక్షి' హెడ్‌లైన్‌షోలో ఇదే తరహా చర్చ జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మాట్లాడుతూ ధర్మానలాగే మోపిదేవికి మంత్రులు బాసటగా నిలిచారని చెప్పుకొచ్చారు. అయితే న్యాయసహాయం విషయంలో మోపిదేవిని ఎందుకు మినహాయించారనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు.
ఇదే విషయంలో జగన్‌పై కేసులు నమోదు చేసినప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు నోరు మెదపని మంత్రులు.. ఇప్పుడు మాట్లాడుతుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సాఆర్‌సిపీ వ్యాఖ్యానించింది. ధర్మాన అంశం కాంగ్రెస్‌కు ధర్మ సంకటమని బిజెపి నేత లక్ష్మణ్, సీనియర్ జర్నలిస్టు సీతారామరాజు అభిప్రాయపడ్డారు.

No comments:
Post a Comment