ఏలూరు:పేద విద్యార్థుల ప్రయోజనం కోసం ఫీజులు చెల్లించాలన్న మనసు ప్రభుత్వానికి ఉంటే మార్గం ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అన్నారు.ఫీజురీయింబర్స్ మెంట్ పై రెండు రోజులు చేసిన దీక్ష విరమించిన అనంతరం ఆమె ప్రసంగించారు. ఫీజురీయింబర్స్ మెంట్ పథకానికి కేటాయించిన నిధులను వైఎస్ సామాజిక పెట్టుబడిగానే భావించారన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతో ఆ మహానేత ఈ పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ పథకంని ప్రభుత్వం అదనపు భారంగా భావిస్తోందన్నారు. వీరు సొంత డబ్బు ఇస్తున్నట్లు బాధపడుతున్నారని విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తేదీలను ఇప్పటివరకు ప్రకటించకపోవడం బాధాకరం అన్నారు.
ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను మూడేళ్ల నుంచి ఒక్కొక్కటి తగ్గిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ ది పెద్ద మనసన్నారు. అనేకమందికి బతుకుపై ఆయన భరోసా ఇచ్చారని చెప్పారు. ఆరోగ్యం కోసం అడిగిన ప్రతిఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం చేశారని గుర్తు చేశారు. ప్రసంగం మధ్యలో వైఎస్ జ్ఞాపకాలతో విజయమ్మ కంటతడిపెట్టారు.

No comments:
Post a Comment