ఏలూరు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఏలూరులో చేపట్టిన ఫీజు దీక్ష కొనసాగుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుకు తమ సొంత డబ్బులివ్వాలన్నట్టు ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని, మహానేత వైఎస్ఆర్ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్‌ను యథాతథంగా కొనసాగించాలని.. బడ్జెట్ లో నిధులు కేటాయించాల్సిందేనని విజయమ్మ డిమాండ్ చేశారు.
విజయమ్మ దీక్షకు పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫీజుదీక్షలో పాల్గొంటున్నారు. ఆ పార్టీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు సంఘీభావం తెలుపుతూ దీక్షా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్‌కు తూట్లు పొడిచి, విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేయొద్దని ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు.

No comments:
Post a Comment