ఏలూరు : పేద విద్యార్థుల పక్షాన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఏలూరులో చేపట్టిన ఫీజుదీక్షకు అన్ని వర్గాల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. విజయమ్మకు సంఘీభావం తెలిపేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దీక్షా వేదిక వద్దకు చేరుకున్నారు.
మహానేత వైఎస్‌ఆర్ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్లే తాము తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోగలుగుతున్నామని తల్లిదండ్రులు తెలిపారు. ఆ పథకాన్ని సర్కార్ నీరుగార్చి పేద విద్యార్థుల చదువులతో ఆటలాడవద్దని విజ్ఞప్తి చేశారు. వైఎస్ విజయమ్మ ఫీజుదీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపేందుకే
వచ్చామని తెలిపారు.
కాగా విజయమ్మ దీక్షకు తిరుపతి ఎస్వీయూ విద్యార్థులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి ఎంతో ఉన్నతాశయంతో చేపట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని, కిరణ్ సర్కారు నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతోందని వారు విమర్శించారు.

No comments:
Post a Comment