* * * పేద విద్యార్థుల్లో ఆత్మస్థయిర్యం నింపిన వైఎస్ విజయమ్మ రెండు రోజుల దీక్ష
* * * సంఘీభావం తెలిపిన లాయర్లు, డాక్టర్లు, విద్యావంతులు, కొల్లేరు వాసులు
* * * ఇతర జిల్లాల నుంచి తరలివచ్చిన అభిమాన జనం
* * * పార్టీ శ్రేణుల్లో ఉప్పొంగిన ఉత్సాహం
లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతున్న ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమరభేరి మోగించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకూ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిక జారీ చేశారు. విజయమ్మ వజ్రసంకల్పం పేద విద్యార్థుల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపింది. వారి తల్లిదండ్రుల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. విజయమ్మ చేపట్టిన ఫీజు దీక్షకు రెండోరోజూ జిల్లా నుంచే కాక పొరుగు జిల్లాల నుంచి కూడా విద్యార్థులు, కార్మికులు, కర్షకులు ప్రభంజనంలా తరలిరావడంతో హేలాపురి వీధులన్నీ కిటకిటలాడాయి. దీక్షా వేదిక ఇండోర్‌స్టేడియం గ్రౌండ్ జనసంద్రమే అయ్యింది. విజయవంతంగా ముగిసిన విజయమ్మ రెండు రోజుల దీక్ష హేలాపురి చరిత్రలో అపూర్వఘట్టంగా నిలిచిపోయింది. ఫీజుదీక్ష పార్టీ కార్యకర్తల్లోనూ, నాయకుల్లోనూ నూతనోత్తేజం నింపింది.
ఏలూరు, న్యూస్‌లైన్ : పాలకపక్షమైన కాంగ్రెస్, ప్రతిపక్షమైన టీడీపీలకు కనువిప్పు కలిగించి లక్షలాది మంది పేద విద్యార్థులకు బాసటగా నిలవాలన్న సంకల్పంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన రెండురోజుల దీక్ష విజయవంతమైంది. పేద విద్యార్థుల్లో ఆత్మస్థయిర్యం నింపడంతోపాటు వారికి మేమున్నాం అనే భరోసాను ఇవ్వడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ఫలప్రదమైంది. జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు విజయమ్మ దీక్షకు తరలివచ్చాయి. జిల్లాలోని పలు కాలేజీలకు చెందిన విద్యార్థులు స్వచ్చందంగా తరలివచ్చారు. కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరుతోపాటు చిత్తూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, విద్యార్థులు ఈ పీజు దీక్షకు తరలిరావడం విశేషం.
విద్యార్థుల కోసం చేసిన ఈ దీక్షకు లాయర్లు, డాక్టర్లు, మేథావులు, కొల్లేరు వాసులు స్వచ్ఛందంగా తరలివచ్చి సంఘీభావం తెలిపారు. విజయవాడకు చెందిన కునుకు రాజశేఖర్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో లాయర్లు వచ్చి విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏలూరుకు చెందిన డాక్టర్ ఏవీఎస్ పద్మరాజు నేతృత్వంలో పలువురు డాక్టర్లు విజయమ్మను కలిసి ఫీజు దీక్ష ముగిసిన సందర్బంగా ఆగస్టు 15న ఉచిత వైద్య శిభిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆశ్రం మెడికల్ కాలేజీ వైద్యులు బుధవారం ఏలూరులో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉచిత వైద్య శిభిరం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కొల్లేరు నుంచి తరలివచ్చిన వేలాది మంది ప్రజలు ఫీజు దీక్షకు మద్దతు పలికారు. కొల్లేరు ప్రాంతం నుంచి ఘంటసాల మహాలక్ష్మిరాజు, జయమంగళ రామారావు తదితరుల నేతృత్వంలో వేలాది మంది మూడు ర్యాలీలుగా వచ్చారు. కోస్తా జిల్లాలకు చెందిన సుమారు 25కాలేజీల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చి విజయమ్మకు మద్దతు పలికారు.
విద్యార్థులచే దీక్ష విరమణ
విద్యార్థుల భవితవ్యం కోసం దీక్ష చేపట్టిన విజయమ్మకు సాయంత్రం 4గంటలకు విద్యార్థులే నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన బి.అఖిల, ఎ.తనూజ, కృష్ణా జిల్లా నూజివీడు శారదా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి శాంతరావు విజయమ్మకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
ఆ విద్యార్థులు మాట్లాడుతూ పేదరికంలో పుట్టిన తాము ఉన్నత చదువులు చదవగలుగుతున్నామంటే వైఎస్ పుణ్యమేనని అన్నారు. వైఎస్ కుటుంబానికి తమ కుటుంబాలు రుణపడి ఉంటాయని అన్నారు. తమ కోసం దీక్ష చేపట్టిన విజయమ్మ మేలును మరువలేమని అన్నారు.
సమన్వయంతో అరుదైన రికార్డు
రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిత కోసం జిల్లా చరిత్రలో మైలు రాయిగా నిలిచే ఫీజు దీక్ష మహోజ్వల ఘట్టానికి పార్టీ నేతలు సమన్వయంతో రికార్డును సాధించారు. నాయకులంతా ఏకతాటిపై నిలిచి ఫీజు దీక్ష విజయంలో పాలుపంచుకున్నారు. జిల్లా పార్టీ కన్వీనర్ తెల్లం బాలరాజు అన్ని నియోజకవర్గాల్లోను సుడిగాలి పర్యటనలు నిర్వహించి దీక్షకు శ్రేణులను సన్నద్ధం చేశారు. దీక్షకు ముందు రోజు నుంచి బాలరాజు జ్వరంతో బాధపడుతూనే జిల్లా పార్టీ శ్రేణుల్ని సమన్వయం చేశారు. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఏలూరులో ఉండి దీక్ష ఏర్పాట్లకు సహకరించారు.
ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో శస్త్ర చికిత్స చేయించుకోవడంతో ఆయన సూచన మేరకు పాతపాటి శ్రీనివాస్‌రాజు ఉండి నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, విద్యార్థులతో కలిసి విజయమ్మదీక్షకు హాజరయ్యారు, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఈసీ మెంబర్ కొయ్యే మోషేన్‌రాజు సైతం జ్వరంతో బాధపడుతూనే దీక్షలో పాల్గొన్నారు. మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్య సైతం దీక్షలో పాల్గొన్నారు. ఇలా జిల్లాలోని ప్రతి నాయకుడు, కార్యకర్త శక్తివంచన లేకండా ఫీజుదీక్షను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు.
దండు కదిలెరో..
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తల దండు కదిలి ఏలూరు వచ్చింది. ఇందుకు ప్రతి నియోజకవర్గంలోను పార్టీ శ్రేణులు చేసిన కృషి విశేషమైంది. భీమవరం నుంచి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, మునిసిపల్ మాజీ చైర్మన్ గ్రంథి వెంకటేశ్వరరావు, నరసాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సారధ్యంలో మొదటి రెండురోజుల్లో విద్యార్థులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావడం విశేషం. తాడేపల్లిగూడెం నుంచి తోట గోపీ, పాలకొల్లు నుంచి ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, గుణ్ణం నాగబాబు, దెందులూరు నుంచి ఊదరగొండి చంద్రమౌళి, పీవీరావు, అశోక్‌గౌడ్, ముంగర సంజీవ్‌కుమార్, తణుకు నియోజకవర్గం నుంచి విడివాడ రామచంద్రరావు, ఎస్‌ఎస్ రెడ్డి, ఆచంట నుంచి వైట్ల కిషోర్, గొలుగూరి శ్రీరామరెడ్డి, గోపాలపురం నుంచి తలారి వెంకట్రావు, కారుమంచి రమేష్, బుసనబోయిన సత్యనారయణ, చెలికాని రాజబాబు, ఏలూరు నుంచి డాక్టర్ దిరిశాల వరప్రసాదరావు, అక్కిశెట్టి చందు, బొద్దాని శ్రీనివాస్, బీవీ రమణ, వేముల వెంకన్న, మున్నుల జాన్‌గురునాథ్, మాగంటి హేమసుందర్, గుడిదేసి శ్రీనివాస్, చింతలపూడి నుంచి కనమతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సుధీర్‌బాబు, సుంకర చంద్రశేఖర్, ముసునూరి వెంకటేశ్వరరావు, ఉంగుటూరు నుంచి గాదిరాజు సుబ్బరాజు, నౌడు వెంకటరమణ, వగ్వాల అచ్యుతరామారావు, కొవ్వూరు నుంచి సీఈసీ మెంబర్ కొయ్యే మోషేన్‌రాజు, బండి అబ్బులు, ముదునూరి నాగరాజు, పోలవరం నుంచి పాశం రామకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, కరాటం కృష్ణ స్వరూప్, మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్నదొర తదితర నేతల నేతృత్వంలో వేలాదిగా విద్యార్థులు, ప్రజలు తరలివచ్చారు.
వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ నాయకత్వంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కొనసాగుతున్న ఫీజు పోరుకు జిల్లా నుంచి భారీగా పార్టీ నేతలు, విద్యార్థులు తరలి వచ్చారు. విజయమ్మను కలుసుకొని సంఘీభావం తెలిపారు. జిల్ల్లా నేతల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా దీక్షలో పాల్గొన్నారు. సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్ర బోస్, జ్యోతుల నెహ్రూ, కేంద్రక్రమశిక్షణ మండలి సభ్యుడు ఏజేవీబీ మహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, పెండెం దొరబాబు, వరుపుల సుబ్బారావు, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ విభాగం కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ రాష్ర్ట ఆర్గనైజింగ్ కార్యదర్శి సుంకర చిన్ని, జిల్లా వాణిజ్యవిభాగ కన్వీనర్ కర్రిపాపారాయుడు, చేనేత సెల్ జిల్లా కన్వీనర్ పంపన రామకృష్ణ, జిల్లా కో- ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, జిల్లా అధికార ప్రతినిధి పి.కె. రావు, రాజమండ్రి నగర కన్వీనర్ బొమ్మన రాజ్‌కుమార్, ఇతర నేతలు తాడి విజయభాస్కరరెడ్డి, కొండేటి చిట్టిబాబు, ఆర్‌వీఎస్ సత్యనారాయణ చౌదరి, జక్కంపూడి గణేష్, భూపతిరాజు సుదర్శనబాబు, వేగిరాజు సాయిరాజు, గుత్తుల సాయి, సిరిపురపు శ్రీనివాస్, మట్టా శైలజ, దాడిశెట్టి రాజ, రొంగలి లక్ష్మి, శెట్టిబత్తుల రాజబాబు, మద్దా చంటిబాబు, యనమదల మురళీకృష్ణ, వేగిరాజు సాయిరాజు, యనమదల గీతదేవి, రావిపాటి రామచంద్రరావు, మార్గాని రామకృష్ణ గౌడ్ మంతెన రవిరాజు, విత్తనాల వెంకట రమణ, వేటుకూరి శివవర్మ,కొండేటి రవి, ఆదిరెడ్డి వాసు, తాడి విజయభాస్కర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యనేతలంతా విజయమ్మతో పాటు దీక్షలో పాల్గొన్నారు. కాగా రాజమండ్రి నుంచి రెండోరోజు దీక్షకు నేతలు, కార్యకర్తలు నగర కన్వీనర్ బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో బయలుదేరారు. వీరి వాహనాలకు టి.కె.విశ్వేశ్వరరెడ్డి జెండా ఊపి సాగనంపారు. జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలోని యువకుల యాత్రను బొమ్మన ప్రారంభించారు. రాజమండ్రి నగర మహిళా విభాగం కన్వీనర్ ఎం.ఎస్. లక్ష్మీ చక్రవర్తి, యువజన విభాగం నగర కన్వీనర్ గుర్రం గౌతమ్, నగర సేవాదళ్ కన్వీనర్ బిల్డర్ చిన్న, సాంస్కృతిక విభాగం కన్వీనర్ బెజవాడ చిన్నికృష్ణ, విద్యార్థి విభాగం కన్వీనర్ వాసిరెడ్డి శ్రీకాంత్ మైనారిటీ నాయకుడు నయూమ్, మాజీ కార్పొరే టర్ బొమ్మనమైన శ్రీనివాస్, నాళం పద్మశ్రీతో పాటు పలువురు ముఖ్య నేతలు ఫీజు పోరులో పాల్గొన్నారు.
No comments:
Post a Comment