వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఫీజు రీయింబర్స్ మెంట్ కొనసాగించాలని కోరుతూ రేపు ఉదయం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చేపట్టనున్న దీక్షకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆ పార్టీ నేత తలశిల రఘురాం చెప్పారు. రేపు ఉదయం విజయమ్మ విమానంలో గన్నవరం వస్తారని తెలిపారు. అక్కడ నుంచి ఆమె ఏలూరు బయలుదేరతారు. మార్గ మధ్యలో హనుమాన్ జంక్షన్ లో డాక్టర్ దుత్తా రామచంద్రరావును కలుస్తారని చెప్పారు. భారీ ర్యాలీతో విజయమ్మ ఏలూరులోని దీక్షాస్థలికి చేరుకుంటారని తెలిపారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో వైఎస్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పిస్తారు. రేపు ఉదయం 10 గంటలకు విజయమ్మ దీక్ష ప్రారంభమవుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment