విజయవాడలో కాంగ్రెస్, టీడీపీల పునాదులకు బీటలు వారుతున్నాయి. ఆ పార్టీలకు చెందిన కార్యకర్తలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారు. తాజాగా జలీల్‌ఖాన్ నేతృత్వంలో 200 మంది వస్త్ర వ్యాపారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పేద విద్యార్థుల సంక్షేమం కోసం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని జలీల్‌ఖాన్ విమర్శించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విజయమ్మ చేపట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ దీక్షను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment