మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రజల ఆదరాభిమానాల మధ్య కొనసాగుతోంది. షర్మిల 36వ రోజు పాదయాత్రను గురువారం సెయింట్ జోసెఫ్ కాలేజ్ నుంచి ప్రారంభించారు. మామిడాలపాడు, తుంగభద్ర బ్రిడ్జి మీదగా యాత్ర పుల్లూరు చేరుకుంటుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగిస్తారు. అటు నుంచి కలుగొట్ల, పోతులపాడు క్రాస్‌రోడ్ మీదుగా బొంకూరు వరకు పాదయాత్ర సాగుతుంది. రాత్రి బొంకూరు శివారులో షర్మిల బసచేస్తారు. పాదయాత్రలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, తెల్లం బాలరాజు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. |
Wednesday, 21 November 2012
షర్మిల 36వ రోజు పాదయాత్ర
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment