వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర జిల్లాలో గురువారంతో ముగుస్తుంది. ఈనెల 8వ తేదీన జిల్లాలో అడుగుపెట్టిన షర్మిల విశేష జనాదరణ మధ్య 14 రోజులుగా 8 నియోజకవర్గాల్లో నడిచారు. బుధవారం నాటికి 191.3 కి.మీ పూర్తయిన పాదయాత్ర చివరి రోజు గురువారం 3.7 కి.మీ మేర సాగనుంది. అనంతరం తుంగభద్ర నది వంతెన ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. 15వ రోజు జిల్లా నుంచి వెళ్లిపోతున్న షర్మిలకు ఘనంగా వీడ్కోలు పలకాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, వైఎస్ కుటుంబ అభిమానులు నిర్ణయించుకున్నారు.
నేడు పాదయాత్ర సాగేదిలా...
బస చేసిన సెయింట్ జోసెఫ్ కాలేజ్ నుంచి గురువారం ఉదయం పాదయాత్రకు షర్మిల శ్రీకారం చుడతారు. అక్కడి నుంచి మామిడాల పాడు ద్వారా తుంగభద్ర బ్రిడ్జి వరకు చేరుకుంటారు. అక్కడ కర్నూలు జిల్లా ప్రజల ఘన వీడ్కోలు మధ్య మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దుల్లోకి అడుగుపెడతారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని పుల్లూరు క్రాస్‌రోడ్ మీదుగా పుల్లూరు గ్రామానికి, అక్కడి నుంచి కలుగొట్ల వరకు 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందని పార్టీ ప్రోగ్రాం కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.

No comments:
Post a Comment