YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 22 November 2012

తెలంగాణ కోసం ఆత్మహత్యలు వద్దు: షర్మిల

 తెలంగాణ ప్రజలకు వైఎస్‌ఆర్ కూతురి అభివాదం అంటూ పాలమూరు జిల్లాలోని పుల్లూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో షర్మిల అన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కర్పూలు జిల్లాలో ముగించి.. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవేశించిన షర్మిలకు పుల్లూరు క్రాస్ రోడ్ వద్ద ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరులకు నా సలాం అని షర్మిల అన్నారు. 

తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, అందరం కలిసి తెలంగాణను బతికించుకుందామని, పవిత్ర తెలంగాణ మట్టిపై ప్రమాణం చేసి చెబుతున్నానని షర్మిల అన్నారు. తెలంగాణ పల్లెల్లో జగనన్న ఖచ్చితంగా సంతోషాలు నింపుతారని, తెలంగాణ అంటే జగనన్నకు ప్రాణమని, తెలంగాణ అభివృద్ధే జగనన్న ధ్యేయమని షర్మిల తెలిపారు. 

వైఎస్‌ఆర్ సంక్షేమ పథకాలన్నీ తెలంగాణలోనే ప్రారంభించారని ఈ సందర్భంగా షర్మిల గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ తన పాదయాత్ర కూడా తెలంగాణ నుంచే ప్రారంభించారని, వైఎస్ మరణాన్ని తట్టుకోలేక గుండె ఆగిపోయినవారిలో తెలంగాణవారే అధికమన్నారు. ఇంతమంది జగనన్న నాయకత్వాన్ని కోరుకుంటున్నారంటే విశ్వసనీయతే కారణం అని అన్నారు. జగనన్న బయట ఉంటే కాంగ్రెస్, టీడీపీ దుకాణాలు బంద్ అవుతాయని, అందుకే కాంగ్రెస్-టీడీపీ కుట్రపన్ని జగనన్నను జైల్లో పెట్టించాయని షర్మిల అన్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!