దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రైతు మోముపై చిరునవ్వు చెరగలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుర్తు చేశారు. షర్మిల మరోప్రస్థానం పాదయాత్ర కర్నూలు చేరిన సందర్భంగా పాతబస్టాండ్ సెంటర్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. షర్మిల రాక సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. సెంటర్ జనంతో కిక్కిరిసిపోయింది. చుట్టుపక్కల మేడలు, మిద్దెలు జనంతో నిండిపోయాయి. రాజన్న నాటి రామరాజ్యాన్ని గుర్తుకు తెచ్చారన్నారు. ఆయన హయాంలో లబ్దిపొందని వర్గం లేదని చెప్పారు. రైతన్నకు భరోసా ఇచ్చారన్నారు.
నేడు రైతన్న పరిస్థితి దుర్భరమైపోయింది. విద్యుత్ బిల్లులు పెనుభారమైపోయాయి. పెట్రోల్ ధర పెరిగింది. గ్యాస్ ధర పెరిగింది. నిరుపేదలకు ఫించన్ అందడంలేదు. బతుకుపై రైతుకు నేడు బెంగపట్టుకుందన్నారు. వైఎస్ రెక్కలపై గెలిచిన ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని మరిచిందని బాధపడ్డారు. చంద్రబాబు ఏనాడూ విచారణను ఎదుర్కోలేదు. ఆయనపై విచారణ జరపడానికి సిబిఐకి సిబ్బందిలేదట. అదే జగన్ పై సిబిఐ ఏం చేసిందో అందరికీ తెలుసన్నారు. 26 బృందాలతో సోదాలు చేయించారు. అంతమంది సిబ్బంది వారికి ఎక్కడ నుంచి వచ్చారో తెలియడంలేదన్నారు. చిరంజీవి అల్లుని ఇంట్లో 80 కోట్ల రూపాయలు దొరికితే కేసులు లేవు. అరెస్టులు లేవు. పైగా ఆయనకు బహుమానంగా కేంద్ర మంత్రి పదవి ఇచ్చారన్నారు.

No comments:
Post a Comment