YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 21 November 2012

అవిశ్వాసం పెట్టమంటే.. డ్రామాలెందుకు: షర్మిల


‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రతినిధి: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వంతో కుమ్మక్కై అవిశ్వాసం పెట్టకుండా ‘మీకోసం’ అంటూ ప్రజల్లోకి వచ్చి డ్రామాలాడుతున్నారు. ఇది చేతకాని ప్రభుత్వం.. అధికారంలో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీలు లేదని చెబుతూనే అదే ప్రభుత్వాన్ని ఈ చంద్రబాబు కాపాడుతున్నారు’’ అని షర్మిల విమర్శించారు. పాదయాత్ర 35వ రోజు బుధవారం కర్నూలు నగరంలో సాగింది. జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా ప్రజలు నల్ల బ్యాడ్జీలు ధరించి వెల్లువలా తరలి వచ్చారు. 

కర్నూలు ప్రధాన రోడ్లన్నీ జనంతో కిటకిటలాడాయి. షర్మిలకు అభివాదం చేసి ఆమెకు స్వాగతం చెప్పేందుకు వచ్చిన జనాలను అదుపు చేయడానికి పోలీసులు, వ్యక్తిగత సిబ్బంది చెమటోడ్చాల్సి వచ్చింది. ఉదయం చిన్నమ్మ సర్కిల్ వద్ద, సాయంత్రం కొండారెడ్డి బురుజు వద్ద జరిగిన సభల్లో ఆమె ప్రసంగించారు. ‘‘కిరణ్‌కుమార్‌రెడ్డికి సీఎం పదవి రావడం రాజన్న చలువ కాదా? రాజన్న రెక్కల కష్టం మీద ఢిల్లీ పీఠం మీద కూర్చుని పరిపాలన చేస్తున్న వాళ్లే ఆయన్ను దోషిగా నిలబెట్టాలనుకోవడం దుర్మార్గం కాదా’’ అని ఆమె నిలదీశారు.

వాతలు పెట్టుకుంటే నక్క పులి అవుతుందా..
‘‘రాజన్న వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్, వృద్ధాప్య పింఛన్ పథకాలను పెట్టారు. ప్రతి పేదింటికి రాజన్న తెచ్చిన సం క్షేమ ఫలం చేరింది. ఆ వేళ ఈ పథకాలను ఎద్దేవా చేసిన చంద్రబాబు.. ‘మీకోసం’ అంటూ బయల్దేరి ఈ పథకాలను తానే అమలు చేస్తానని నక్క వినయం ప్రదర్శిస్తున్నాడు. ‘పులిని చూసి.. నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా పులి అవుతుందా’’ అంటూ చంద్రబాబు వైఖరిని షర్మిల తూర్పారబట్టారు. 35వ రోజు బుధవారం పాదయాత్రలో కల్లూరు మండలంలోని సెయింట్ క్లారెట్ పాఠశాల నుంచి బయల్దేరిన షర్మిల పాదయాత్ర 12 కిలోమీటర్ల మేర సాగింది. గురువారం కర్నూలు జిల్లాలో మరొక 3.70 కి.మీ. ప్రయా ణం చేసి షర్మిల తుంగభద్ర బ్రిడ్జి మీదుగా మహబూబ్‌నగర్ జిల్లాలోకి అడుగు పెడతారు. మూడు జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని తెలంగాణ జిల్లాల్లోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉందని షర్మిల అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!