కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కె.గురునాథ్‌రెడ్డి కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి (జగ్గప్ప) పలువురు తన అనుచరులతో కలిసి మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను ఆమె నివాసంలో జగ్గప్ప కలుసుకుని ఆమె ఆశీస్సులు పొందారు. విజయమ్మ ఆయనకు కండువాను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జగ్గప్ప తండ్రి కె.గురునాథ్ రెడ్డి కొడంగల్ నుంచి ఐదుసార్లు కాంగ్రెస్ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment