ఏం సాధించారని సూర్యాపేట సభ
పది ప్రశ్నలకు సభలోసమాధానం చెప్పాలని డిమాండ్
వరంగల్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు కొండా సురేఖ మరోసారి మండిపడ్డారు. తెలంగాణ పేరుతో ఆయన రాజకీయ వ్యాపారం సాగిస్తున్నారని ఆరోపించారు. హన్మకొండలో శనివారం విలేకరుల సమావేశంలో ఆమె బహిరంగ లేఖ విడుదల చేశారు. తాను సంధించే పది ప్రశ్నలకు సూర్యాపేట బహిరంగ సభలో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఈ లేఖలో డిమాండ్ ఆమె చేశారు.
కొండా సురేఖ పది ప్రశ్నలు : 1) తెలంగాణ ఉద్యమం పేరుతో మీ కుటుంబం చేసే రాజ కీయవ్యాపారానికి వెయ్యిమందికిపైగా అమాయక యువ కులు, విద్యార్థులు బలి అయినందుకు ఆనందంతో ఉత్సవం జరుపుకోవడానికి సభ నిర్వహిస్తున్నావా..? 2) వైఎస్సార్‌సీపీపై అవాకులు చెవాకులు విసురుతూ, తెలంగాణ సెంటిమెంట్ పేరుతో ప్రజలను మభ్యపెట్టి సొమ్ము చేసుకుంటున్న నువ్వు, నీ కుటుంబ సభ్యులకు, టక్కుట మార విద్యలతో భక్తి పేరుతో అమాయక ప్రజలను మాయ చేసే దొంగ బాబాలు, నకిలీ స్వాములకు తేడా ఉందా..? 3) కాంగ్రెస్‌తో ఒకసారి పొత్తుపెట్టుకుని కేంద్ర మంత్రివర్గంలో చేరావు. నీ కుటుంబసభ్యులు, భజనపరులను మంత్రివర్గంలో చేర్పించావు. ప్యాకేజి కుదరక బయటకు వచ్చావు. మరోసారి టీడీపీతో పొత్తు పెట్టుకున్నావు. ఫలితాలు రాకముందే బీజేపీతో కేంద్రంలో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించావు. మళ్లీ కాంగ్రెస్‌తో అంట కాగావు. అసలు నీకు ఓసిద్ధాంతం అంటూ ఉందా..? 4) తెలంగాణకు రావాలంటే వీసాలు, పాస్‌పోర్టులు కావాలని వైఎస్ అన్నారని, పార్లమెంటులో జగన్ సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్నారని ప్రచారం చేస్తున్నావు. మరి నువ్వు టీడీపీలో ఉండగా నిండు అసెంబ్లీ సాక్షిగా 610 జీవో ను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పాట పాడిన విషయం గుర్తు లేదా. 5) 11 ఏళ్లుగా రాజకీయ ప్రక్రియ ద్వారా రాని తెలంగాణ రాష్ట్రం ఇప్పుడెలా వస్తుంది? 6) తెలంగాణ ఇస్తుందంటూ ఇంతకాలం కాంగ్రెస్‌కు వంతపాడిన నువ్వు... ఇప్పుడు కాంగ్రెస్‌ను బొంద పెట్టాలంటున్నావు. ఎన్నికల తరువాత ఏ పార్టీకి మద్దతు ఇస్తావో చెప్పే దమ్ము...ధైర్యం ఉందా.?7)నీ తప్పులకు, నీ మాటలు నమ్మిన యువకులు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి బాధ్యులెవరు? 8)పదవులు నీ కుటుంబానికే... ప్రచారం కూడా నీ కుటుంబానికేనా? పత్రికల్లో రోజూ కేటీఆర్, హరీష్‌రావు, కవిత తప్ప మరొకరు కనిపించరా? అసలు టీఆర్‌ఎస్‌లో మీ కుటుంబ సభ్యులకన్నా సామర్థ్యం, సమర్థత ఉన్న లీడర్లు లేరా? 9) సూర్యాపేట సభ పేరుతో ఎంత వసూలు చేస్తున్నావు?10)ఉద్యమ పార్టీ అంటూ వివిధపార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నావు. ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళితే ప్యాకేజీలు అంటున్నావు. నువ్వు ఎమ్మెల్యేలను ఆకర్షిస్తే ఉద్యమం అంటున్నావు. దీనిపై నీకున్న చిత్తశుద్ధి ఏమిటి?

No comments:
Post a Comment