http://www.ysrcongress.com/news/news_updates/rashtramlo_asalu_prabhutvam_vundaa_.html
ఖమ్మం 19 నవంబర్ 2012 : ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గమూ సంతోషం గా లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవా ధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్నఅనుమానం కలుగుతోందని ఆమె విమర్శించారు. ఖమ్మంలో సోమవారం జరిగిన ఒక భారీ బహిరంగసభలో విజయమ్మ ప్రసంగిస్తూ రాజశేఖర్ రెడ్డిగారి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం ప్రజావ్యతిరేకంగా మారిందన్నారు.
రాజశేఖర్ రెడ్డిగారు ఒక్క రూపాయి కూడా పన్ను వేయకుండా శాచ్యురేషన్ విధానంతో అర్హులైనవారందరికీ పథకాలను అమలు చేసి ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించారనీ, కానీ ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదనీ విజయమ్మ అన్నారు.
"ఆర్టీసీ రేట్లు మూడుసార్లు పెంచి భారం మోపారు. కరెంటు బిల్లులపై సర్‌చార్జీల పేరుతో వేల కోట్లు ప్రభుత్వం దండుకుంటోంది. మద్యం ఏరులై పారుతోంది. ఎరువుల ధరలు మూడు వందల శాతం పెరిగాయి. సబ్సిడీ విత్తనాలు లేవు. గిట్టుబాటు ధరలు లేవు. పల్లెల్లో రెండు గంటలు కూడా కరెంటు ఉండడం లేదు. చీకట్లో ఉంటున్నాయి. పరిశ్రమలు మూతబడ్డాయి. లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. పెట్రోధరలు భగ్గుమంటున్నాయి. గ్యాస్ ధర పెంచారు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయిపోయింది. ఫీజుల పథకం నీరుగారింది. 108, 104 లేవు.

No comments:
Post a Comment