వైఎస్ పథకాలకు కిరణ్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని షర్మిల మండిపడ్డారు. తన హయాంలో 4వేల మంది రైతులను చంద్రబాబు పొట్టనబెట్టుకున్నారని అన్నారు. వైఎస్ జగన్ బయట ఉంటే కాంగ్రెస్, టీడీపీకి తమ దుకాణాలు బంద్ అవుతాయని భయంతో కుట్రలు, కుత్రంత్రాలు పన్నుతున్నారని షర్మిల అన్నారు. అందుకే విచారణ పేరుతో జగనన్నను జైల్లో ఉంచారని మహబూబ్ నగర్ జిల్లా కొరివిపాడులో షర్మిల అన్నారు.
తెలంగాణలో షర్మిల పాదయాత్రకు జనం ఘనస్వాగతం పలుకుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేత కొండా సురేఖ అన్నారు. చంద్రబాబు చేస్తున్న పాదయాత్రను ప్రజలెవరూ విశ్వసించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా తెలంగాణలో వైఎస్ఆర్ సీపీకి 60 సీట్లు వస్తాయని సురేఖ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నాటి షర్మిల పాదయాత్రలో కొండాసురేఖ పాల్గొన్నారు.

No comments:
Post a Comment