రాజశేఖరరెడ్డి మరణంతో రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.వైఎస్ హయాంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటినీ తాకాయని, అలాంటి పాలననే ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఆదరిస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం ఇవ్వకుంటే తెలంగాణా ప్రాంతంలో కాంగ్రెస్‌ను దేవుడు కూడా రక్షించలేడన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ హైకమాండ్ నిర్లక్ష్యం చేస్తే ప్రస్తుతం ఉన్న నేతలెవరూ తిరిగి గెలిచి ప్రసక్తే లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తం అయ్యిందని, సీఎంను మార్చినా కాంగ్రెస్ బాగుపడదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర ఏర్పాటుతో పాటుగా, అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నార న్నారు. సందర్భం వస్తే వైఎస్సార్ రుణం తీర్చుకుంటానని, జగన్‌కు అండగా నిలబడతాన న్నారు.
source:sakshi
source:sakshi





No comments:
Post a Comment