వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పాదయాత్రికురాలు షర్మిలకు తెలంగణాలో ప్రవేశించగానే బ్రహ్మాండమైన స్వాగతం లభించడం విశేసం.వేలాది మంది అభిమానుల మధ్య ఆమె పుల్లూరు క్రాస్ రోడ్డు వద్ద ఆమె మహబూబ్ నగర్ జిల్లాలోకి వచ్చారు.షర్మిల రాక సందర్భంగా జనంతో జాతీయ రహదారి అంతా నిండి పోవడంతో ట్రాపిక్ కూడా స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో ప్రవేశించినప్పుడు షర్మిలకు ఎలాంటి స్వాగతం లభిస్తుందన్నదానిపై తర్జనభర్జనలు జరిగాయి.మధుయాష్కి అంటే వంటి ఎమ్.పిలు ఏకంగా తెలంగాణ ద్రోహులు మాత్రమే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరతారని వ్యాఖ్యానించినా, జనం ఎవరూ పట్టించుకోలేదని అనుకోవాలి. టిఆర్ఎస్ అదినేత కె.చంద్రశేఖరరావు కూడా ఈ పరిణామాన్ని ముందుగానే ఊహించి జెఎసితో చర్చలు జరిపినప్పట్టికీ, జనవాహినిని వెళ్లనివ్వకుండా చూడడంలో సఫలం కాలేకపోయారు.గతంలో జగన్ కు మహబూబ్ బాద్ కు వెళుతున్నప్పడు అప్పటి రోశయ్య ప్రభుత్వం టిఆర్ఎస్ తో మాచ్ ఫిక్సింగ్ చేసుకుని రైలులో వెళుతున్న జగన్ ను అరెస్టు చేసి , రైలుపై రాళ్లు వేసినవారిని ఉదాసీనంగా వదలిపెట్టింది.కాని ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల మధ్య షర్మిలకు ప్రజలు ఘన స్వాగతం చెప్పడం గమనించదగిన పరిణామం.అయితే కొందరు షర్మిలను అడ్డుకుంటామని చెప్పినప్పటికీ అలాంటిదేమీ జరగకపోవడం మంచిదే.
http://kommineni.info/articles/dailyarticles/content_20121122_16.php
No comments:
Post a Comment