వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించి 13 రోజులు పూర్తయింది. 14వ రోజు కర్నూలు నగరంలో పాదయాత్ర సాగుతుంది. అక్టోబర్ 18న ఇడుపుల పాయలో ప్రారంభమైన ‘మరో ప్రజా ప్రస్థానం’ ఇప్పటి వరకు 34 రోజుల్లో 450 కిలోమీటర్ల మైలురాయి దాటింది.
సెయింట్ క్లార్క్ స్కూల్ నుంచి బుధవారం ఉదయం పాదయాత్ర ప్రారంభమై కర్నూలు నగరంలోకి ప్రవేశిస్తుంది. బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్, కృష్ణానగర్, మసీదు సెంటర్, గాయత్రి ఎస్టేట్ రోడ్డు, కలెక్టరేట్, మెడికల్ కాలేజ్ గేట్, బుధవార పేట, కల్లూరి బ్రిడ్జ్, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, పూలబజార్, పెద్ద మార్కెట్, ఓల్డ్ బస్టాండ్, పోలీస్ లైన్, ప్రకాశ్ నగర్ గుండా సెయింట్ జోసెఫ్ కాలేజ్ వరకు 12 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. కళాశాల ఆవరణలోనే రాత్రి బస ఏర్పాటు చేసినట్లు పార్టీ ప్రోగ్రాం కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు. చెన్నమ్మ సర్కిల్, పాత బస్టాండ్‌లలో బహిరంగ సభలను ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు,

No comments:
Post a Comment