YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 22 November 2012

తెలంగాణకు విజయమ్మ శాల్యూట్!

http://www.ysrcongress.com/news/top_stories/telanganaku_vijayamma_salute_.html

 వైయస్ పథకాల వల్ల తెలంగాణకే ఎక్కువ ప్రయోజనం కలిగిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. రాజశేఖర్ రెడ్డిగారి వల్ల తెలంగాణ అభివృద్ధి బాటలో నడిచిందని ఆమె పేర్కొన్నారు. షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర తెలంగాణలోకి అడుగుపెట్టిన సందర్భంగా పాలమూరు జిల్లా పుల్లూరు వద్ద జరిగిన ఒక భారీ బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. ప్రసంగం ప్రారంభంలోనే తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన బిడ్డలకు, వైయస్ మరణానంతరం మరణించినవారికీ విజయమ్మ నివాళులు అర్పించారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవించి తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలుపలేదని ఆమె గుర్తు చేశారు.
రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్తు పథకం వల్ల 75 శాతం తెలంగాణకే మేలు జరిగిందంటూ గర్వంగా చెప్పగలనని ఆమె పేర్కొన్నారు. రుణాల మాఫీ, కరెంటు బకాయిల మాఫీ వంటి నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలు ప్రయోజనం పొందారన్నారు. వైయస్‌కు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివన్నారు. పేదరికానికి శాశ్వతపరిష్కారంగా రాజశేఖర్ రెడ్డిగారు 'జలయజ్ఞం'తో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారన్నారు. తెలంగాణలో ఎల్లంపల్లి, దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను వైయస్ చేపట్టారన్నారు. జలయజ్ఞం కోసం 51వేల కోట్లు ఖర్చు చేస్తే, అందులో 25 వేల కోట్లు తెలంగాణలోనే ఖర్చు 
16.50 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వైయస్ కల అని ఆమె అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ సస్యశ్యామలమౌతుందని వైయస్ తలచారన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులూ వైయస్ సాధించారన్నారు. మహారాష్ట్ర ఈ ప్రాజెక్టుపై చర్చలకు సిద్ధమైనా ప్రస్తుత ప్రభుత్వంలో కదలిక లేదని ఆమె విమర్శించారు. 
రాజశేఖర్ రెడ్డిగారు రాయలసీమవాసి అయినప్పటికీ అన్ని ప్రాంతాలనూ సమానంగా ప్రేమించారన్నారు. వైయస్ కానీ, జగన్‌బాబు కానీ తెలంగాణకు వ్యతిరేకులు కాదన్నారు.ఆనాడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో 45 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి తోడ్కొనివెళ్లి తెలంగాణ ఆవశ్యకతను తెలియజెప్పింది రాజశేఖర్ రెడ్డిగారేనని ఆమె గుర్తు చేశారు. తాత్సారం చేయకుండా సత్వరమే ఏ ప్రాంతంవారి మనోభావాలూ దెబ్బతినకుండా తెలంగాణ సమస్యను పరిష్కరించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని కోరిందన్నారు. తెలంగాణ రావణకాష్ఠం కావడానికి కేంద్ర ప్రభుత్వమే కారణన్నారు. తెలంగాణ మనోభావాలను గౌరవిస్తామంటూ జగన్‌బాబు పార్చీ ప్లీనరీలో చెప్పారని ఆమె వివరించారు. ఆ ప్రకటనకు వైయస్ఆర్ సీపీ కట్టుబడి ఉంటుందని విజయమ్మ స్పష్టం చేశారు. 
రాజశేఖర్ రెడ్డి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం ఇవాళ ఉండీ లేనట్టే ఉందని విజయమ్మ వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డిగారి సంక్షేమపథకాలన్నిటికీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ పథకం, ఆరోగ్యశ్రీ వంటివి అటకెక్కాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అచ్చం చంద్రబాబు ప్రభుత్వంలాగే తయారైందన్నారు. చంద్రబాబు హయాంలో నాలుగువేల మంది ఆత్మహత్యలు చేసుకుంటే, ఇప్పుడూ అలాంటి పరిస్థితులే ఉన్నాయని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. నాడు వైయస్ చేపట్టిన ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా తయారయ్యాయన్నారు. ఈ ప్రభుత్వం ఏ వర్గానికైనా మేలు చేసిందని చెప్పగలదా అని ఆమె ప్రశ్నించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!