టీడీపీ నేత యనమల రామకృష్ణుడుకు వైఎస్ఆర్ సీపీ నేత జ్యోతుల నెహ్రు బహిరంగ లేఖ రాశారు. వైఎస్ జగన్ జైల్లో సెల్‌ఫోన్ వాడుతున్నారంటూ చేసిన ఆరోపణలపై ఆయన 4 పేజీల లేఖ పంపారు. వైఎస్ జగన్‌పై యనమల అర్ధరహిత ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. జైలు నిబంధనలు తెలుసుకోకుండా యనమల మూర్ఖంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రజాక్షేతంలో వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేక కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కయ్యాయని విమర్శించారు. జగన్ సాక్షులను ప్రభావతం చేస్తారన్నది మీ భయమా? లేక ప్రజల భవిష్యత్‌కు తన తండ్రి మాదిరిగానే భరోసా ఇస్తారని భయమా? అని సూటిగా ప్రశ్నించారు. జగన్‌కు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment