పేదల మోముపై చిరునవ్వు చూసేందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అహర్నిశలూ కష్టపడ్డారని, ఆయన మరణానంతరం ప్రభుత్వం సంక్షేమ పథకాలను విస్మరించిందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ అన్నారు. ఇక్కడి పెవిలియన్ గ్రౌండ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో జలగం వెంకట్రావ్ వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ స్ఫూర్తితోనే ఆయన ఆశయ సాధన కోసం ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు. ‘‘మహానేత స్ఫూర్తితో ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న నేను జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు నిధులు తెచ్చాను. వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. మాజీ సీఎం జలగం వెంగళరావు తర్వాత ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత వైఎస్‌దే’’ అని చెప్పారు.
20 వేల కుటుంబాలు చేరిక: గతంలో ఏ పార్టీలో చేరని విధంగా జిల్లా రాజకీయ చరిత్రలోనే 20 వేల కుటుంబాలు విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు జలగం వెంకట్రావు ప్రకటించారు.
20 వేల కుటుంబాలు చేరిక: గతంలో ఏ పార్టీలో చేరని విధంగా జిల్లా రాజకీయ చరిత్రలోనే 20 వేల కుటుంబాలు విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు జలగం వెంకట్రావు ప్రకటించారు.
No comments:
Post a Comment