వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీఆర్‌ఎస్ నాయకులు వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారని వైఎస్‌ఆర్ పార్టీ నాయకుడు గట్టు రామచంద్రరావు శనివారం పేర్కొన్నారు. ఈ పద్దతి మానుకోవాలని టీఆర్‌ఎస్ నాయకులకు ఆయనహితవు పలికారు. ప్రజలను భయపెట్టి బతకాలని టీఆర్‌ఎస్ పార్టీ చూస్తోందని ఆయన అన్నారు. ఒక పార్టీని మరొక పార్టీ అడ్డుకునే సంస్కృతిని టీఆర్‌ఎస్ ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఇది మంది సంస్కృతి కాదని గట్టు రామచంద్రరావు అభిప్రాయపడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment