వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం కలుగోట్ల నుంచి ప్రారంభం అవుతుంది. ఉదయం కలుగోట్ల గ్రామం నుంచి బయల్దేరి పోతులపాడు స్టేజీ సమీపంలో శనగ రైతులతో షర్మిల మాట్లాడతారు. అనంతరం అక్కడి నుంచి బొంకూరు మీదుగా చంద్రశేఖర్‌నగర్‌కు చేరుకుంటారు. తర్వాత శ్రీనగర్ మీదుగా కలుకుంట్లకు చేరుకుని అక్కడి ప్రజలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం బూడిదపాడు క్రాస్ వరకు యాత్ర కొనసాగించి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు. శుక్రవారం మొత్తం 14.6 కి.మీ యాత్ర సాగనుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment