షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం(ఈ నెల 22వ తేదీ) మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించనుంది. మధ్యాహ్నం 1 గంటకు తుంగభద్ర బ్రిడ్జి వద్ద షర్మిల మహబూబ్‌నగర్‌లో అడుగుపెడతారని జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మ కృష్ణారెడ్డి, సీజీసీ సభ్యుడు కె.కె.మహేందర్‌రెడ్డి, పాదయాత్ర సమన్వయ కమిటీ సభ్యుడు తలశిల రఘురామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు షర్మిలకు ఘనస్వాగతం పలకడానికి సంసిద్ధులవుతున్నారని చెప్పారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 225 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment