YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 23 November 2012

తెలుగువాళ్ళ ఆత్మ గౌరవ స్వరాన్ని తాకట్టు పెట్టనన్న తర్వాతేగదా!

సేవ చేసిన ఆనవాళ్ళే గానీ
"జనం" మనిషిగా గా నిల్చిన ఆనవాయితేగానీ

దేశ సార్వభౌమత్వాన్ని
ధిక్కరించిన దాఖలాలు కనబడలేదు..

తెలుగువాళ్ళ ఆత్మ గౌరవ స్వరాన్ని
తాకట్టు పెట్టనన్న తర్వాతేగదా!
హస్తిన బానిసత్వానికి
హస్తగతం కానన్న తర్వాతేకదా!
స్వేచ్ఛా సామ్రాజ్యాల కూల్చివేతల అర్బన్ లెజెండ్లూ..
సెన్సార్షిప్ గడ్డ మీద ప్రజా నాయకుడికి కాపిటల్

పనిష్మెంట్లూ...

ఉండవల్లి సాక్ష్యాలు

ఉండ చుట్టుకుపోయినట్లు
అవినీతి ఆకాశం మీద
అనంత అవినీతి చంద్రుడు కనిపించనప్పుడు
కరపత్రం రాసుకునే వాళ్ళకీ
కులపార్టీల పబ్బం గడుపుకునేవాళ్ళకీ
టాయిలెట్ పేపర్లు నడుపుకునే వాళ్ళకీ
ఇవి కనబడని రాజుగారి దేవతా వస్త్రాలు..

జనాభిమానాన్ని అడ్డుకునేందుకు
ఎంచుకున్న ఫ్రాంకెన్‌స్టైన్ భూతాలు...
గుప్పెడు ఓట్ల కొట్లాటలో
మత ప్రసక్తిలేని లౌకిక రాజ్యంలో
ఆత్మల పోరాటంలో కొందరి నల్లమందే ఆత్మై
రెడ్డనీ - క్రిస్టియన్ రెడ్డనీ - రెడ్డి క్రిస్టియననీ
కులమతాలను వికటించేదాకా హింసించి
పరిహసించింతర్వాత
కుల పరిశుద్ధత ఎవడిక్కావాలి!
ఈ ఇసుక ధర కొందరికైనా
బంగారంగా మారాలి..

ఆత్మగౌరవ లిట్మస్ పరీక్షలో
అనవసర "అత్యవసర పరిస్థితి"లో
మనస్సాక్షి "హస్త"గతమయింతర్వాత
న్యాయం ఎటు వేపుందో చూడాలి..

ధర్మ పోరాటానికి దైవబలం,ప్రజా బలం కావాలి
ఆరోపణలకు బ్యాలన్స్ షీట్ ఆసరా కావాలి
వట్టినే శబ్దాలు చేసేవాళ్ళు రుజువులైనా
సేకరించగలగాలి
దేన్నీ రుజువు చెయ్యలేనివాళ్ళు
దేనికీ సమాధానం చెప్పలేనివాళ్ళు
సాక్ష్యం లేకుండా ఎన్ని రోజులు జనం మెచ్చిన నాయకుణ్ణి చరశాలలో అక్రమంగా బందిస్తారు ..

ఒక రోజనేది ఉంటుంది..ఆ రోజు ఆయనది ఔతుంది ..
జనం ఇచ్చిన తీర్పే ఒక గొప్ప సమాదానం ఔతుంది ....





source: facebook

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!