దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న కాలం సువర్ణయుగం అయితే చంద్రబాబు అధికారంలో ఉన్న కాలం శ్మశానయుగం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పార్టీలో చేరుతున్న సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ బిల్లులు చెల్లించలేని రైతులను జైలులో పెట్టారని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చంద్రబాబు పాలనలో రైతులు దయనీయపరిస్థితిని ఎదుర్కొన్నారు. కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు ఆనాడు ఎందుకు రుణమాఫీ చేయలేదని ఆమె ప్రశ్నించారు. ఆ రోజు విద్యుత్ బకాయిలు ఎందుకు రద్దు చేయలేదని అడిగారు. బాబు హయాంలో ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
చంద్రబాబూ ఒక్కసారి వైఎస్ పరిపాలన గుర్తుచేసుకో అన్నారు. వైఎస్ రావడంతోనే రైతులకు రుణమాఫీ చేశారన్నారు. బాబూ మీకు విశ్వసనీయత అంటే అర్ధం తెలుసా? అని ప్రశ్నించారు. వైఎస్ కు విశ్వసనీయత ఉందన్నారు. పాదయాత్ర పేరుతో చంద్రబాబు మహానాటకం ఆడుతున్నారని విమర్శించారు. విలువైన భూములను అప్పనంగా అప్పగించింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా తప్పించుకుంటున్నారన్నారు. ఉపఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.
జగన్‌ను అన్యాయంగా,అక్రమంగా జైలులో పెట్టారన్నారు. నల్లకాలువలో ఇచ్చిన మాట కోసం జగన్ ఓదార్పుయాత్ర మొదలు పెట్టారని చెప్పారు.
ప్రస్తుత ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారన్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. పల్లెల్లో విద్యుత్ సరఫరా లేదు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయింది. ఫీజురీయింబర్స్ మెంట్ పై అనేక ఆంక్షలు పెట్టి దానిని నీరుగార్చారు. మద్యం ఏరులైపారుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం ఆ పని చేయడంలేదు. చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలేదని విమర్శించారు.
సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పెవిలియన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో జలగం వెంకట్రావుతోపాటు పలువురు జిల్లా ప్రముఖులు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు .
source:sakshi

No comments:
Post a Comment