తెలంగాణ ప్రాంతమంటే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఎంతో ఇష్టమని వైఎస్ విజయమ్మ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పుల్లూరు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. తెలంగాణకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ ఏ నిర్ణయం తీసుకోలేదు అని అన్నారు. వైఎస్‌ఆర్ పథకాలు పేదలకు చేరేంతవరకు తాము పోరాడుతామని విజయమ్మ అన్నారు. తన ప్రసంగంలో చంద్రబాబుపై విజయమ్మ నిప్పులు చెరిగారు. చిరంజీవి హోల్‌సేల్‌గా పీఆర్పీని అమ్మితే... చంద్రబాబు టీడీపీని రిటైల్‌గా కాంగ్రెస్‌కు అమ్మారని వైఎస్ విజయమ్మ అన్నారు. తెలంగాణలో షర్మిల పాదయాత్రకు ఘనస్వాగతం పలికిన అందరికీ విజయమ్మ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ కోసం అమరులైన వారందరికీ జోహార్లు అని వైఎస్ విజయమ్మ అన్నారు. బహిరంగ సభలో కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యేలు చల్లా వెంకట్రామిరెడ్డి, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. |
Thursday, 22 November 2012
'తెలంగాణ అంటే వైఎస్ కు ఎంతో ఇష్టం'
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment