పార్లమెంటరీ సంప్రదాయాలు తెలియని అజ్ఞానిలా టీడీపీ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని గోనె ప్రకాశ్ మండిపడ్డారు. యూపీఏకు అసలు మద్దతే ప్రకటించని వైఎస్ఆర్ సీపీని మద్దతు విరమించుకోమని రేవంత్ ఎలా కోరతారని గోనె ప్రశ్నించారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎమ్ఎల్ఏలపై స్పీకర్‌కు టీడీపీ ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని గోనె ప్రశ్నించారు. ఉపఎన్నికలు వస్తే డిపాజిట్లు కూడా రావనే భయంతోనే స్పీకర్ కు టీడీపీ ఫిర్యాదు చేయలేదని గోనె ప్రకాశ్ అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment