రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంపై ప్రజ ల్లో అసంతృప్తి ఉన్న మా ట వాస్తవమేనని కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు అంగీకరించారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు సమర్థంగా చెప్పకోలేకపోవడమే అందుకు ప్రధాన కారణమన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమష్టి కృషితో ప్రజల్లోకి తీసుకెళితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని చెప్పారు. శుక్రవారమిక్కడి కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూ లింగ్’ 24వ వార్షికోత్సవాల్లో పొల్గొన్నాక పళ్లం రాజు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్రలు, కాంగ్రెస్ నుంచి వలసల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయమెలా సాధ్యమన్న ప్రశ్నకు.. ‘ప్రజాస్వామ్యంలో ప్రతీ నాయకుడు ప్రజల్లోకి వెళ్లాల్సిందే. అధికారంలో ఉన్నవారేమో తమ పథకాల గురించి, ప్రతిపక్షాలమో సర్కారు వైఫల్యాల గురించి ప్రజలకు చెబుతారు. వాస్తవమేంటన్నది ప్రజలే నిర్ణయిస్తారు’ అని అన్నారు. అవకాశవాదంతో కొందరు ఇతర పార్టీల్లోకి వలస వెళ్తున్నారన్నారు. జలయజ్ఞం ప్రాజెక్టులు సరిగ్గా అమలు కావడం లేదన్నది వాస్తవమేనన్నారు.
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=492489&Categoryid=14&subcatid=0
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=492489&Categoryid=14&subcatid=0
No comments:
Post a Comment