జగన్‌పై అక్షరాలా విషం కక్కుతున్నారు
యనమలపై వైఎస్సార్‌సీపీ నేత జ్యోతుల మండిపాటు* ఒక్క ఆరోపణనైనా నిరూపించాలంటూ బహిరంగ లేఖ
* అధికారం కోసం టీడీపీ దిగజారుతోందంటూ ధ్వజం
* యనమలకు అసలు జైలు నిబంధనలు తెలుసా?
* జగన్ ఓ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ.. ఆయన్ను ఎవరైనా కలిస్తే తప్పా?.. విచారణ ఖైదీల ములాఖత్‌లపై ఏ ఆంక్షలూ లేవు
* జగన్ జైలు గదిలో కొత్తగా టైల్స్ వేసినట్టు నిరూపిస్తారా?
* జగన్ లేకుంటే బాగుండునేమో అన్నంత ద్వేషమెందుకు?
* మిగతా వీఐపీ ఖైదీలతో కలిసి బ్యాడ్మింటన్ ఆడటమూ నేరమేనా?
* వారికంటే జగన్‌కు ఒక్క అదనపు సౌకర్యమైనా ఉందని నిరూపించగలరా?
* ఏ సౌకర్యాలూ లేకుండా జగన్‌ను చీకటి గదిలో బంధించాలని మీ ఉద్దేశమా?
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో వీఐపీ ఖైదీల కంటే అదనంగా ఒక్క సౌకర్యాన్నయినా పొందుతున్నట్లు నిరూపించగలరా? అసలు మీకు జైలు నిబంధనలు తెలుసా? అంటూ టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడుకు వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ సవాలును విసిరారు. ఈమేరకు నెహ్రూ మంగళవారం యనమలకు ఒక బహిరంగ లేఖ రాశారు.
జగన్ జైలుకు వెళ్లే దాకా కాంగ్రెస్‌తో కుమ్మక్కై కపట నాటకాలు ఆడిన టీడీపీ, ఆ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న ఎల్లో మీడియా ఇప్పుడు కొత్త అంకానికి తెరతీస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్, టీడీపీ, వాటికి వంత పాడుతున్న మీడియా... తప్పుడు కథనాలతో విషం కక్కుతున్న తీరు ప్రజలను విస్మయానికి గురిచేస్తోందని, సుదీర్ఘకాలం మంత్రిగా, శాసనసభ స్పీకర్‌గా కూడా పనిచేసిన సీనియర్ నేత యనమల కూడా ఇష్టానుసారం ఆరోపణలు చేయడం చూస్తే వారి కుట్రలకు ఇంకా పదును పెడుతున్నారనేది ప్రజలకు అర్థమైపోయిందన్నారు. జగన్ జైలులో సెల్‌ఫోన్ వాడుతున్నారని, ఆయన ఉండే సెల్‌లో కొత్తగా టైల్స్ వేశారని అభియోగాలు మోపారని, స్వతహాగా న్యాయవాది అయిన రామకృష్ణుడు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు తెలుసుకునేందుకు తాను ప్రయత్నించానని నెహ్రూ వెల్లడించారు. అందులో భాగంగానే జైళ్లలో ఉండే విచారణ ఖైదీలకు సంబంధించి వారికి ఉన్న హక్కులు, నిబంధనలు తెలుసుకున్నానని అన్నారు. ఈ క్రమంలో కొందరు పదవీ విరమణ చేసిన అధికారులతో కూడా మాట్లాడానన్నారు. యనమలకు రాసిన లేఖలో వివరాలు ఇలా ఉన్నాయి.
1971 నాటి జైలు మాన్యువల్ ప్రకారం విచారణ ఖైదీల ములాఖాత్‌లకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు. నేరారోపణ రుజువై శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు మాత్రమే వారానికి రెండుసార్లు వారి కుటుంబ సభ్యు లు లేదా సన్నిహితులతో ములాఖాత్‌కు అవకాశం లభిస్తుంది. కానీ, విచారణ ఖైదీలకు అలాంటి ఆంక్షలేమీ లేవు. సమయం, సందర్భాన్ని బట్టి జైలు అధికారి సం తృప్తి చెందితే వారిని కలవడానికి వచ్చేవారికి ములాఖాత్‌కు అవకాశం ఇవ్వవచ్చు... ఇక్కడే ఇంకో విషయా న్ని పరిగణనలోకి తీసుకోవాలి... జగన్‌మోహన్‌రెడ్డి ఓ రాజకీయపార్టీకి అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు. ఆయన విచారణను ఎదుర్కొంటున్న ఖైదీ మాత్రమే. ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. వారిలో అనేక మంది ఆయనను కలవడానికి వస్తారు. జైలు అధికారుల ఎన్నిసార్లు ఎవరినైనా కలిసేందుకు అవకాశం ఇవ్వవచ్చు.
జగన్‌ను అరెస్టు చేయడానికి ప్రధాన కారణం... ఆయ న పార్లమెంటు సభ్యుడు, పలుకుబడి కలిగిన వ్యక్తి కనుక సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉం దేమోనన్న అనుమానంతో మాత్రమే! ఇప్పటివరకూ జగన్‌ను కలిసేందుకు వచ్చినవారి రికార్డులు పరిశీలిం చి వారిలో ఎవరైనా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్న వ్యక్తులు ఉంటే ఆ వివరాలను టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చెప్పగలరా?
ఇవన్నీ గమనిస్తే... ఒక వ్యక్తిపై వీరికి ఎంత ద్వేషభావం ఉందో తెలుస్తోంది. ఏ తప్పు చేయని ఓ వ్యక్తి జైలుకు వెళ్లినా వీరిలో కాస్తయినా మానవత్వం ఉండదన్నది దీన్నిబట్టి తేటతెల్లమవుతుంది. అసలు జగన్ లేకుంటే బాగుండునేమో అన్నంత ద్వేషభావం వీరిలో దాగి ఉందన్నది స్పష్టమవుతుంది. వారి హేయమైన వ్యవహారశైలిని తలచుకుంటేనే బాధ కలుగుతుంది. ఏ తప్పు జరగని చోట కూడా ఏదో జరిగిపోతుందన్నట్లు టీడీపీ సాగిస్తున్న విషప్రచారం చూస్తుంటే అధికారం కోసం ఇంతగా దిగజారాలా? అనిపిస్తుంది.
ఒక రాజకీయపార్టీ అధినేతను తీసుకెళ్లి జైలులో పెట్టిం ది నేరం చేశారని కాదు... అధికారాన్ని దుర్వినియోగం చేశారని కాదు... ప్రజాప్రతినిధిగా ఆయన అవినీతికి పాల్పడ్డారని అంతకన్నా కాదు. విజయవంతంగా నడుస్తున్న ఆయన సంస్థల్లో పెట్టుబడులన్నీ ‘క్విడ్ ప్రో కో’ అంటూ ఓ నినాదాన్ని తెరపైకి తెచ్చి ఏ ఆధారాలు లేకుండానే కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు, టీడీపీ నేతలు అశోకగజపతిరాజు, బెరైడ్డి రాజశేఖరరెడ్డి తదితరులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కౌంటర్ అఫిడవిట్ తీసుకోకుండానే హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం అంతా ఒక పథకం ప్రకారం కుమ్మక్కు రాజకీయం సాగింది. ఆ కుమ్మక్కు ఫలితమే సరిగ్గా ఉప ఎన్నికల ప్రచారం మధ్యలో జగన్‌ను జైలుకు పంపించడం! మరి ఆయనను జైలులో ఎవరైనా కలిస్తే తప్పు ఎలా అవుతుంది? ఒక రాజకీయ పార్టీ అధినేతను జైలులో ఎవరైనా కలవకుండా ఎలా ఉంటారు? బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేస్తారేమో అన్న అనుమానంతో కదా సీబీఐ కోర్టులో వాదించి ఆయనకు బెయిల్ రాకుండా చేసింది! సాక్ష్యాలు తారుమారు చేస్తారని సీబీఐ అనుమానపడుతోందనే కదా ఆయన కొంత కాలంపాటు జైలులో ఉండాలని కోర్టు ఆదేశించింది. అటువంటప్పుడు ఆయన నేరస్తుడు ఎలా అవుతాడు? విచారణ మొదలవకుండానే ఆయన నేరస్తుడైపోయాడా?
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న న్యాయవాది యనమల రామకృష్ణుడికి, శిక్ష పడిన నేరస్తులకు కూడా ఎలాంటి హక్కులు ఉంటాయో తెలియదనుకోవాలా? లేక తెలిసి రాజకీయం కోసం అసత్య ప్రచారం చేస్తున్నాడని అనుకోవాలా? ఐక్యరాజ్య సమితి డిక్లరేషన్ ప్రకా రం నేర నిరూపణ అయిన ఖైదీలు అన్ని హక్కులు కలిగి ఉంటారు. వారు ఉండే సెల్‌లో విద్యుద్దీపంతో పనిలేకుండానే వార్తాపత్రిక చదివే అంత వెలుగు ఉం డాలి. వారానికి రెండు లేదా మూడుసార్లు వారి కుటుం బ సభ్యులను, స్నేహితులను కలిసే అవకాశం ఉండా లి. ప్రతి ఆరుగురు ఖైదీలకు ఒక టాయ్‌లెట్ ఉండాలి.
అంతెందుకు మన రాష్ట్రంలో చర్లపల్లి జైలులో ఉండే ఖైదీలకు వారానికి రెండుసార్లు వారి కుటుంబ సభ్యు లు, బంధువులతో ఫోన్లో మాట్లాడుకునే అవకాశం ఈ మధ్యే కల్పించారు. మరి ఏ నేరం చేయని జగన్, విచారణ ఖైదీగా కోర్టు ఆదేశించిన మేరకు ప్రత్యేక సౌకర్యాలు పొందితే తప్పా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైళ్ల మ్యానువల్ ప్రకారం విచారణ ఖైదీలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు. ఇది నేను అంటున్నది కాదు జైళ్ల శాఖ అధికారులు చెపుతున్న మాట.
జైళ్ల మ్యానువల్ ప్రకారం అప్పట్లో అందుబాటులో ఉన్న కిరోసిన్ స్టౌలను వినియోగించాలి. కానీ, ఇప్పుడూ అవే కిరోసిన్ స్టౌలను వినియోగించాలని కోరడంలో అర్థం లేదు. కుక్కర్ కూడా వంట సామగ్రి లో భాగమే. కోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ప్రత్యేక కేటగిరి ఖైదీలకు కావాల్సిన వంట సామాన్లు బయటి నుంచి తెచ్చుకునే సౌకర్యం ఉంది. ఒక్క జగన్‌కే కాదు జైలులో ఉన్న మిగిలిన వీఐపీ ఖైదీలందరికీ ఈ సదుపాయం వర్తిస్తుంది.
నాలుగు మాసాల కాలంలో 150 మందిని జగన్ కలిశాడన్నది వారి అభియోగం. విచారణ ఖైదీలకు సంబంధించి ములాఖాత్‌లు ఎన్నిసార్లు అనుమతించాలన్న నిబంధనలు లేనే లేవు. మరి అలాంటప్పుడు జగన్‌ను జైలు నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పార్టీ నేతలు కలిస్తే తప్పు ఎలా అవుతుంది? అసలు ఎవరినీ కలవనీయకండా, నిబంధనల ప్రకా రం ఉండాల్సిన ఏ సౌకర్యాలు లేకుండా ఆయనను చీకటి గదిలో బంధించాలని టీడీపీ, ఎల్లో మీడియా కోరుకుంటున్నదా?
ఎల్లో మీడియాలో భాగమైన ఓ పత్రికలో ఇటీవల ప్రచురించిన కథనాన్ని చూస్తే వారి మానసిక స్థితిపైన నాకే జాలేసింది. జగన్ 120 రోజుల్లో 134 మందిని కలిశారట. నేను ఇప్పటికే చెప్పినట్లు వాళ్లు ప్రతిరోజూ కలిశారని ఆ పత్రిక భావిస్తే నేను చేయగలిగిందేమీ లేదు. ఆ కథనంలోనే జగన్ బావ అనిల్‌కుమార్ మారు పేర్లతో జగన్‌ను కలుస్తున్నారంటూ తప్పుడు వ్యాఖ్యలు చేశారు. వాస్తవం ఏమిటంటే జైలు నిబంధనల ప్రకా రం వారానికి రెండు రోజుల ములాఖాత్‌లో భాగంగానే ఆయన కలిశారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అన్న కుమారుడి పేరు వైఎస్ అనిల్ కుమార్ (అనిల్ బాబు అని కూడా అంటారు) కొన్నిసార్లు ములాఖాత్ ద్వారా కలిశారు. ఆయన కలవడాన్ని అనిల్‌కుమార్ కలవడంతో ముడిపెట్టి మారుపేర్లతో కలుస్తున్నారం టూ రాయడం వారికే చెల్లింది.
ఇవన్నీ చూస్తుంటే... నాకు అనిపిస్తున్నది ఒక్కటే. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా రెండు ప్రధాన పార్టీలుగా చెలామణి అవుతున్న కాంగ్రెస్, టీడీపీ తమకిక భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వచ్చి జగన్‌పై బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ప్రజలు అంత అమాయకులు కాదు. టీడీపీ, కాంగ్రెస్, ఎల్లో మీడియా గడచిన రెండేళ్లుగా చేస్తున్న దుష్ర్పచారాన్ని వారు గమనిస్తూనే ఉన్నారు... ఇంకా గమనిస్తారు.
టైల్స్ వేశారని రుజువు చేస్తారా?
జగన్ ఉంటున్న సెల్‌లో కొత్తగా ఫ్లోరింగ్ వేశారని రామకష్ణుడు చేసిన ఆరోపణను ఆయన నిరూపించగలరా? తమ అధినేత చంద్రబాబు మాదిరి విశ్వసనీ యత లేని నాయకుడిని కాదని భావిస్తే ఆయన ఆ సెల్‌ను సందర్శించవచ్చుకదా! ‘విచారణ ఖైదీల్లో వీఐపీలు ఉన్నారని గమనించి ఏడాది క్రితం జైళ్లశాఖ ఎన్నడో నిజాంకాలంలో నిర్మించిన ఓ భవనాన్ని వారికి సిద్ధంచేసింది. దానిలో ఫ్లోరింగ్ షాబాద్‌బండలతో ఉంటుంది. పైగా జైలులో ఉన్న మిగిలిన వీఐపీ ఖైదీల కంటే జగన్‌కు ఏ ఒక్క అదనపు సౌకర్యంలేదు. భవనం శిథిలావస్థలో ఉండటం, టాయ్‌లెట్లు మరీ పాడవడం తో వాటి అడుగుభాగంలో టైల్స్ వేసి కొత్త సామగ్రిని అమర్చాం. జగన్ జైలుకు రావడానికి చాలా కాలం ముందే వాటికి మరమ్మత్తులు చేశామని పదవీ విరమణ చేసిన ఓ అధికారి నాకు చెప్పారు.
ఆడటానికే కదా...బ్యాడ్మింటన్ కోర్టు ఉంది!
ఈ సందర్భంగా యనమలను అడుగుతున్నా... ఓ న్యాయవాదిగా ఆయన ఖైదీల హక్కులను హరించాలని కంకణం కట్టుకున్నారా? జైలులో బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు చేసింది ఖైదీలు అడుకోవడం కోసం. అది ఏ ఒక్క జగన్ కోసమో మరెవరి కోసమో ఏర్పాటు చేసింది కాదు. పైగా జగన్ వస్తున్నాడని ఏర్పాటు చేసింది అంతకంటే కాదు. మరి టీడీపీకి, ఆ పార్టీకి వంత పాడుతున్న ఎల్లో మీడియాకు ఎందుకంత ద్వేషం! చంచల్‌గూడ జైలులో బాల్ బ్యాడ్మింటన్ కోర్టులో ఒకేసారి నలుగురు ఆడే అవకాశం ఉంది. మరి జగన్ ఒక్కరే ఎలా ఆడుతారు? జైలులో ఉన్న మిగిలిన వీఐపీ ఖైదీలతో కలిసి ఆయన బ్యాడ్మింటన్ ఆడటమూ నేరమేనా? టీడీపీ ఏ ఉద్దేశాలతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తోంది? వారి అసత్య ఆరోపణలు చూసి జైలు అధికారులే విస్తుపోతున్నారు.
No comments:
Post a Comment