మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆమె పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. విజయమ్మ ఈ సందర్భంగా స్వర్ణ సుధాకర్ రెడ్డికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. స్వర్ణక్కతో పాటు పలువురు మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment