తెలుగుదేశంలో అసంతృప్త నాయకుడిగా గత కొంతకాలంగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ బాట పట్టారు. కొద్ది నెలల క్రితం ఉమ్మారెడ్డి టిడిపి రాజ్యసభ సీటును ఆశించారు.కాని అది దక్కకపోవడంతో ఆయన నిరాశకు గురి అయ్యారు. ఉమ్మారెడ్డి కాపు సామాజికవర్గ నాయకుడుగా , ప్రముఖుడిగా ఉన్నారు. 1985 లో తొలిసారి బాపట్ల నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత తెనాలి, బాపట్ల ల నుంచి మూడుసార్లు ఎమ్.పి అయ్యారు.యునైటెడ్ ఫ్రంట్ హయాంలో దేవెగౌడ, గుజ్రాల్ మంత్రివర్గాలలో సభ్యుడిగా ఉన్నారు. పార్టీలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసి, చంద్రబాబుకు సన్నిహితంగా మెలిగిన నేతగా గుర్తింపు పొందారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తూ రాజకీయాలలోకి వచ్చిన ఉమ్మారెడ్డి ఇరవైఏడేళ్లపాటు టిడిపిలో ఉండి ఇప్పుడు పార్టీని వీడి జగన్ పార్టీలో చేరడం విశేషం. జగన్ ను ఆయన ఈ నెల ఇరవై రెండున కలవబోతున్నారు. ఆ తర్వాత తెనాలిలో సభ నిర్వహించి పార్టీలో ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు.
source: http://kommineni.info/articles/dailyarticles/content_20121119_10.php
source: http://kommineni.info/articles/dailyarticles/content_20121119_10.php
No comments:
Post a Comment